కాస్తంత ఇంగువ... కొండంత ప్రయోజనం

ఇంగువ ఘమఘుమలులేని తాలింపుకి విలువేముంటుంది? ఆ సువాసన మాత్రమేనా? పోషకాల విషయంలోనూ వంటల్లో ఇంగువది కీలక పాత్ర.

Published : 04 Jun 2023 00:47 IST

ఇంగువ ఘమఘుమలులేని తాలింపుకి విలువేముంటుంది? ఆ సువాసన మాత్రమేనా? పోషకాల విషయంలోనూ వంటల్లో ఇంగువది కీలక పాత్ర..
* కార్బోహైడ్రేట్‌లు, పీచు, పొటాషియం, కాల్షియం, వంటి పోషకాలుండటంతోపాటు చర్మ ఆరోగ్యానికి సహకరించే నూనెలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అజీర్తి, శ్వాసకోశ సమస్యలు, బీపీ, నెలసరి సమస్యలకు ఇంగువ చక్కని పరిష్కారం. ఊబకాయం రాకుండా చూస్తుంది.
* మనసు బాగోలేనప్పుడు ఇంగువ వేసిన వంటకాలు తింటే మూడ్‌ మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తహీనత నివారించి ఏకాగ్రతను పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. ఒత్తిడి లేకుండా చేస్తుంది.
* ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నలభై దాటిన మహిళల్లో ఎముకలు బలహీనం అవుతుంటాయి. అటువంటి వారికి ఇంగువ మంచి ఉపశమనం ఇస్తుంది.

* ఆస్తమా, బ్రాంకైటిస్‌, న్యుమోనియా, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* మహిళల్లో ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ని ఉత్పత్తి చేసి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా తగ్గిస్తుంది. నెలసరి క్రమం తప్పకుండా చేసి, నొప్పిని అదుపు చేస్తుంది.
* గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఇంగువ నూనె వేసి.. పుక్కిలిస్తే దానిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు దంత క్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్‌, రక్తస్రావం, నోటి దుర్వాసన రాకుండా చూస్తాయి. ఈ ప్రయోజనాలని అందుకోవడం కోసం ఇంగువతో చేసిన హింగ్‌ గోలీ హింగ్‌ పెడాని కొన్నిప్రాంతాల్లో ఇష్టంగా తింటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని