Vegan Egg: వేగన్‌ ఎగ్‌.. కోడి పెట్టని గుడ్డు ఇది..

మనలో కొందరు పూర్తి శాకాహారులుంటారు. చేపలు, మాంసాలే కాదు పశువుల నుంచి వచ్చిన పాలు, గుడ్లు కూడా తీసుకోరు. అలాంటి వారి కోసం వేగన్‌ చికెన్‌, మటన్‌లు వచ్చాయి.

Updated : 29 Oct 2023 09:51 IST

నలో కొందరు పూర్తి శాకాహారులుంటారు. చేపలు, మాంసాలే కాదు పశువుల నుంచి వచ్చిన పాలు, గుడ్లు కూడా తీసుకోరు. అలాంటి వారి కోసం వేగన్‌ చికెన్‌, మటన్‌లు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ‘వేగన్‌ ఎగ్‌’ కూడా వచ్చేసింది.

పప్పులు, పనీర్‌, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ రకమైన గుడ్లు అచ్చం కోడిగుడ్లలానే ఉంటాయి. అసలైన గుడ్లను, వీటిని కలిపి ఉంచితే తేడా బొత్తిగా కనిపెట్టలేం. ఇంతకీ ఈ కృత్రిమ గుడ్డును ఎలా చేస్తారంటే.. శనగపప్పును గ్రైండ్‌ చేసి పెరీపెరీ మసాలా, మ్యాగీ మసాలా, కొద్దిగా నూనె, కొన్ని నీళ్లు, కాస్త పసుపు కలిపిన మిశ్రమంతో గుడ్డు లోపల ఉండే పచ్చ సొనను చేస్తారు. మలై కోవాలో మొక్కజొన్న పిండి, రాక్‌ సాల్ట్‌ వేసి బాగా కలిపి.. తెల్ల భాగం చేసి, మధ్యలో శనగపప్పుతో చేసిన మిశ్రమాన్ని ఉంచి.. గుడ్డు ఆకృతి ఇస్తారు. ఈ కృత్రిమ గుడ్డును ఉడకబెట్టడానికి రాక్‌సాల్ట్‌ నీళ్లే ఉపయోగించాలి. ఇది సరిగ్గా ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది. రుచికీ, పోషకాలకూ కూడా సాధారణ గుడ్డుతో సమానమే అంటున్నారు. బాగుంది కదూ! నవంబరు 1 ‘ప్రపంచ వేగాన్‌ దినోత్సవం’. ఈ సందర్భంగా అచ్చమైన శాకాహారం తినాలనుకుంటే.. కోడితో సంబంధం లేని ఈ గుడ్డు చేసి చూడండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని