ఇవి మేలుగోరు చిక్కుడు

మనలో చాలామంది చిక్కుడు తింటారు కానీ.. గోరుచిక్కుడు మాత్రం ఎందుకో పెద్దగా ఇష్టపడరు. నిజానికివి చాలా మంచివని చెబుతున్నారు ఆహార నిపుణులు.

Updated : 21 Jan 2024 00:14 IST

నలో చాలామంది చిక్కుడు తింటారు కానీ.. గోరుచిక్కుడు మాత్రం ఎందుకో పెద్దగా ఇష్టపడరు. నిజానికివి చాలా మంచివని చెబుతున్నారు ఆహార నిపుణులు. గ్వార్‌ బీన్స్‌, క్లస్టర్‌ బీన్స్‌ అని పిలుచుకునే గోరుచిక్కుడు కాయల్లో ఎన్ని సుగుణాలున్నాయో చూడండి.. వీటిలో విటమిన్లు, ప్రొటీన్లు, పీచు, చక్కెర, కాల్షియం, ఐరన్‌, భాస్వరం విస్తారంగా ఉన్నాయి. తరచూ గోరుచిక్కుడు తినేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తసరఫరా సవ్యంగా ఉంటుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఊబకాయం రాదు. ఇవి ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి. పేగుల్లో మలినాలను తొలగిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. పుండ్లు, గాయాలు నయమవుతాయి. వీటిలోని డయేటరీ ఫైబర్‌ గుండెను సంరక్షిస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు మరీ అవసరం. కడుపులో శిశువుకు నరాల వ్యవస్థ, మెదడు వృద్ధి చెందుతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్‌ సూక్ష్మక్రిములను నశింప చేస్తాయి. గోరుచిక్కుడులో పోషకాలు సమృద్ధిగా ఉన్నందున నీరసం, నిస్సత్తువ రావు. మెదడులో ఆందోళన తగ్గించి సేదతీరుస్తాయి. వీటితో కూర, పచ్చడి, సలాడ్‌.. ఏదైనా బాగుంటుంది. కాస్త కొబ్బరి తురుము జోడిస్తే ఇక అద్భుత రుచితో అలరిస్తుంది. ఇంత మేలు చేసే వీటిని గోరుచిక్కుడు అనేకంటే మేలుగోరు చిక్కుడు అనొచ్చు. రుచిలోనూ అమోఘమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని