ఎండు నెత్తళ్ల పచ్చడి...

కావాల్సినవి: ఎండు నెత్తళ్లు- 200గ్రా, కారం- చెంచా, ధనియాల పొడి- అరచెంచా, పసుపు- పావుచెంచా, నూనె- నాలుగు చెంచాలు, ఉప్పు- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, ఎండుచేపల్లో ఉప్పు ముందు నుంచి ఉంటుంది కాబట్టి ఉప్పు సరిచేసుకుని వేసుకోవాలి.

Published : 08 Apr 2018 01:26 IST

ఫటాఫట్‌
ఎండు నెత్తళ్ల పచ్చడి...

కావాల్సినవి: ఎండు నెత్తళ్లు- 200గ్రా, కారం- చెంచా, ధనియాల పొడి- అరచెంచా, పసుపు- పావుచెంచా, నూనె- నాలుగు చెంచాలు, ఉప్పు- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, ఎండుచేపల్లో ఉప్పు ముందు నుంచి ఉంటుంది కాబట్టి ఉప్పు సరిచేసుకుని వేసుకోవాలి.

తయారీ: ఎండునెత్తళ్లని ఇసుక లేకుండా శుభ్రం చేసుకుని వేడినీటిలో ఇరవైనిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తలలు తీసి శుభ్రం చేసి నీటిని వడకట్టి పావుగంటపాటు తడిలేకుండా చేసుకోవాలి. వీటికి ధనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు పట్టించి పదినిమిషాల పాటు ఉంచాలి. ఒక పాత్రలో నూనె తీసుకుని వేడిచేసుకుని ఇందులో చేపలని దోరగా కరకరలాడేలా వేయించుకోవాలి. చివరిగా కరివేపాకుని వేసి దింపేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని