చికెన్‌ ఆమ్లెట్‌

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌-100గ్రా, గుడ్డు- ఒకటి, పసుపు, ఉప్పు, కారం- తగినంత, ఉల్లిపాయ ముక్కలు- రెండు చెంచాలు, జీలకర్ర- పావుచెంచా, అల్లంతరుగు- పావుచెంచా, పచ్చిమిర్చి తరుగు- అరచెంచా, నూనె- తగినంత...

Published : 20 May 2018 01:37 IST

పాఠక వంట
చికెన్‌ ఆమ్లెట్‌

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌-100గ్రా, గుడ్డు- ఒకటి, పసుపు, ఉప్పు, కారం- తగినంత, ఉల్లిపాయ ముక్కలు- రెండు చెంచాలు, జీలకర్ర- పావుచెంచా, అల్లంతరుగు- పావుచెంచా, పచ్చిమిర్చి తరుగు- అరచెంచా, నూనె- తగినంత
తయారీ: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, చికెన్‌ వీటన్నింటిని చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, చికెన్‌, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉప్పు, కారం, గరంమసాలా కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసుకుని అందులో గుడ్డు పగలకొట్టి అట్టు పోసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్‌ ముక్కల్ని వేసుకుని  రోల్‌లా చుట్టుకుంటే సరి.

-కర్ణయిన రజని, రాజాం, శ్రీకాకుళం

మీరూ రాయండి: ఆయా ప్రాంతాల్లోని నోరూరించే, సంప్రదాయ వంటకాలని పాఠకులు పంపిస్తే ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని