రోజ్‌హిప్‌టీతో....కీళ్లనొప్పులు దూరమిక!

అందం, ఆరోగ్యం కోసం... సంప్రదాయ టీ స్థానంలోకి హెర్బల్‌ టీలు వచ్చాయి. వాటిల్లోనూ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే రోజ్‌హిప్‌ టీ తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు..

Updated : 05 Jun 2022 01:43 IST

అందం, ఆరోగ్యం కోసం... సంప్రదాయ టీ స్థానంలోకి హెర్బల్‌ టీలు వచ్చాయి. వాటిల్లోనూ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే రోజ్‌హిప్‌ టీ తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు..
* సాధారణ హెర్బల్‌ టీలతో పోలిస్తే ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* రక్తంలోని ట్రైగ్లిజరాయిడ్లని అదుపుచేసి.. గుండెజబ్బులు రాకుండా చేస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది.
తుంటి, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతర్గత వాపుల రాకుండా చూస్తుంది.
* ఈ టీని నిత్యం తాగేవారికి విటమిన్‌ సి, విటమిన్‌ ఇలు పుష్కలంగా అందుతాయి. ఈ విటమిన్లు... చర్మంలో సాగే గుణాన్ని పెంపొందించి వయసు ఛాయలని వెనక్కి నెడతాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని