బాయ్‌ ఇడ్లీ... ఆ రుచికి ఎవరైనా జై కొట్టాల్సిందే!

వరంగల్‌లోని అలంకార్‌ సెంటర్‌కెళ్లి యూసఫ్‌ బాయ్‌ ఇడ్లీ బండి ఎక్కడ?.. అంటే ఎవరైనా చూపిస్తారు. అంతగా ఫేమస్‌ ఈ ఇడ్లీ సెంటర్‌. ఇడ్లీనా అని పెదవి విరిచేవాళ్లు కూడా ఈ రుచికి జై కొట్టాల్సిందే!

Updated : 21 Aug 2022 09:00 IST

వరంగల్‌లోని అలంకార్‌ సెంటర్‌కెళ్లి యూసఫ్‌ బాయ్‌ ఇడ్లీ బండి ఎక్కడ?.. అంటే ఎవరైనా చూపిస్తారు. అంతగా ఫేమస్‌ ఈ ఇడ్లీ సెంటర్‌. ఇడ్లీనా అని పెదవి విరిచేవాళ్లు కూడా ఈ రుచికి జై కొట్టాల్సిందే!

సాధారణంగా టిఫిన్‌ సెంటర్‌ అంటే వడ, దోసె, బోండాలాంటివన్నీ దొరుకుతాయి కదా... కానీ అవేమీ ఇక్కడ ఉండవు. ఇడ్లీ తప్ప మరేం దొరకవు. అయినా సరే జనం ఇక్కడ క్యూ కట్టడానికి కారణం.. వాటి రుచే. వేడి వేడి ఇడ్లీ...ఆపైన నెయ్యి. అందులోకి పల్లీ చట్నీ... కారప్పొడి. ఈ రుచిని మర్చిపోవడం అంత తేలిక్కాదనేది ఆహారప్రియుల మాట. అదీ నిజమే. ఉదయం గం.6.30 నుంచి గం.11.30 వరకు ఒకటే రద్దీ. ఎవరైనా టిఫిన్‌ కోసం వేచి ఉండాల్సిందే. వేడివేడిగా పాత్ర నుంచి తీసి నేరుగా వడ్డిస్తుంటారు. హాట్ బాక్స్‌లో పెట్టరు.

40 ఏళ్ల క్రితం చిన్న ఇడ్లీ బండిని యూసఫ్‌ ప్రారంభించాడు. ఇప్పుడు దానిని అతని కుమారులైన అన్వర్‌-అబుజర్‌లు నిర్వహిస్తున్నారు. చట్నీ, కారంపొడి అన్నీ ఇంటి దగ్గర నుంచే స్వయంగా తయారు చేసుకొని తీసుకొస్తారు. స్థానికులతోపాటు పొరుగు జిల్లాల వారూ ఇక్కడ ఇడ్లీల కోసం క్యూ కడతారు. తమకు వేరే టిఫిన్‌ సెంటర్ల నుంచి అవకాశాలు వచ్చినా వెళ్లలేదని తమ తండ్రి ప్రారంభించిన దీన్ని కొనసాగిస్తామని అన్వర్‌-అబుజర్‌లు చెబుతున్నారు.

- మురళీకృష్ణ, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని