పెసర కుడుములు వహ్వా అనిపించాలంటే..
పెసర కుడుములు చేయాలని ప్రయత్నిస్తే అంత బాగా రాలేదు. ఎలా చేస్తే ఎక్కువ రుచిగా ఉంటాయో కాస్త చెప్పండి!
పెసర కుడుములు చేయాలని ప్రయత్నిస్తే అంత బాగా రాలేదు. ఎలా చేస్తే ఎక్కువ రుచిగా ఉంటాయో కాస్త చెప్పండి!
- వినాయక చవితి ప్రసాదాలన్నీ రుచీ, ఆరోగ్యంతో కూడినవే. పెసర కుడుములూ అంతే. ఇవి మరింత రుచిగా ఉండాలంటే.. పెసలు మంచి సువాసన వచ్చేదాకా వేయించి, తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
- బెల్లం తురుములో అతి కొద్ది నీళ్లు పోసి, దగ్గర పడే దాకా కలియతిప్పి, ఇందులో ఉడికించిన పెసర ముద్ద వేయాలి.
- బియ్యప్పిండిని మీడియం ఫ్లేమ్ మీద గట్టి ముద్దలా అయ్యేదాకా కలియ తిప్పుతూ ఉడికించుకోవాలి. నచ్చితే బ్రౌన్ రైస్ పిండి కూడా వాడుకోవచ్చు.
- స్టఫ్ఫింగ్‌లో యాలకులపొడి వేయాలి. దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి కూడా వేస్తే.. భిన్నమైన రుచి వస్తుంది.
- ఉడికించిన బియ్యప్పిండి చిన్నగా పరిచి.. దానిమీద పెసరముద్దను ఉంచి, విస్తరాకులో చుట్టాలి. విస్తరాకు లేదా అరటి ఆకును ఉపయోగిస్తే.. ఆ పరిమళం, రుచి చాలా బాగుంటాయి.
- విస్తరాకును ఒక నిమిషం నీళ్లలో ఉంచితే ఆకు మధ్యకి మడిచినా చిరగదు. అలా ఆకును మరో మడత వేసి ఇడ్లీ కుక్కర్లో హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద ఇంకో 5 నిమిషాలు ఉడికించాలి.
పవన్ సిరిగిరి, చెఫ్, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
-
New Words: ఫిన్స్టా.. గర్ల్‌బాస్.. షెఫ్స్ కిస్.. ‘జెనరేషన్ జడ్’ సరికొత్త పదాలు డిక్షనరీలోకి!
-
Minor Boy: నగ్నంగా స్తంభానికి కట్టేసి.. మైనర్ బాలుడిపై వికృత చర్య