సినిమా హాల్లో దొంగతిండి!

సినిమాకి వెళ్లామంటే పాప్‌కార్న్‌, ఐస్‌క్రీం లాంటి చిరుతిళ్లు ఉండాల్సిందే! అవి తిన్నాక శీతల పానీయాలూ తాగాలి. అప్పుడే అసలైన మజా వస్తుంది. కాదా మరి! రెండున్నర గంటలు ఏమీ తినకుంటే ఏదో అనీజీగా ఉంటుంది.

Updated : 24 Sep 2023 03:53 IST

సినిమాకి వెళ్లామంటే పాప్‌కార్న్‌, ఐస్‌క్రీం లాంటి చిరుతిళ్లు ఉండాల్సిందే! అవి తిన్నాక శీతల పానీయాలూ తాగాలి. అప్పుడే అసలైన మజా వస్తుంది. కాదా మరి! రెండున్నర గంటలు ఏమీ తినకుంటే ఏదో అనీజీగా ఉంటుంది. ఆకలి కాకపోయినా.. కాలక్షేపం కోసమైనా తినాలి కదా! కానీ తిందామంటే మల్టీప్లెక్సుల్లో రేట్లు అదిరిపోతున్నాయి. గుప్పెడు స్నాక్స్‌కు వందలు ఖర్చుపెట్టాలంటే ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. పోనీ బయటే కొనుక్కుని వెళ్దామంటే వీల్లేదంటారు. సంచిలోనో, జేబులోనో కొంచెం తీసుకెళ్లినా విమానాశ్రయంలో దొంగ బంగారం పట్టుకున్నంత హంగామా, హడావుడి చేసి పక్కన పెట్టేస్తారు. ఈ సమస్యను భలేగా పరిష్కరించాడో కుర్రాడు. అసలు సంగతేమంటే.. అక్షయ్‌కుమార్‌ సూపర్‌ హిట్‌ సినిమా ‘ఓఎమ్‌జీ 2’కి వెళ్లాడు అల్ఫేష్‌ షేక్‌. ఇంటర్వెల్లో ఎంచక్కా తాను తెచ్చుకున్న చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌ లాంటివి దర్జాగా టేబుల్‌ మీద పెట్టుకుని తిన్నాడు. చెకింగ్‌లో దొరక్కుండా వాటిని గిఫ్ట్‌ ప్యాక్‌లా సీల్‌ చేసి తెచ్చాడు. ఆ వీడియో ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేస్తే.. అది కాస్తా వైరలైంది. ఇప్పటిదాకా మూడున్నర కోట్ల వ్యూస్‌, ఇరవై లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఫన్నీ కామెంట్స్‌కూ కొదవ లేదు. ‘ఇదేం మోసమో, దొంగతనమో కాదు.. మన దగ్గర బీభత్సంగా దోచుకుంటున్న వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి’ అంటూ కుర్రాణ్ణే సమర్థిస్తున్నారంతా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని