ఇంట్లోనే సులువుగా క్రిస్పీ కార్న్‌!

మా పిల్లలకు ‘క్రిస్పీ కార్న్‌’ అంటే చాలా ఇష్టం. రెస్టారెంట్‌ స్టయిల్లో చేసేందుకు టిప్స్‌ చెప్పండి!

Updated : 01 Oct 2023 05:23 IST

మా పిల్లలకు ‘క్రిస్పీ కార్న్‌’ అంటే చాలా ఇష్టం. రెస్టారెంట్‌ స్టయిల్లో చేసేందుకు టిప్స్‌ చెప్పండి!

  • కార్న్‌ ఎండితే రుచిగా ఉండదు. అందువల్ల తాజాది ఎంచుకోండి. అప్పుడే చక్కగా వేగి కరకరలాడుతుంది. దీనికి మామూలు మొక్కజొన్నల కంటే స్వీట్‌ కార్న్‌ బాగుంటుంది.
  • ఫ్రోజెన్‌ కార్న్‌ లేదా తాజా కార్న్‌.. ఏదైనా వాడుకోవచ్చు. తాజావైతే పూర్తి గింజ వచ్చేలా ఒలవాలి.
  • కార్న్‌ నీళ్లలో వేసి హై ఫ్లేమ్‌ మీద మూత పెట్టకుండా 80% ఉడికించాలి. అంటే కొద్దిగా పలుకుగా ఉండాలి. ఒక గింజ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది.
  • ఉడికించాక అందులో నీటిని వెంటనే వంపేసి, చన్నీళ్లు పోస్తే మరింత మెత్తబడవు. వాటిని చల్లారనిచ్చి కార్న్‌ ఫ్లోర్‌ జల్లాలి. వేడి మీద అయితే- ఎంత పిండి వేసినా చాలదు. కార్న్‌ ఫ్లోర్‌ ఎక్కువైతే పకోడీలా తయారవు తుంది. కొన్ని నీళ్లు చిలకరిస్తే.. పిండి గట్టిగా పట్టుకుంటుంది. నీళ్లు ఎక్కువైతే కరకరలాడవు.
  • నూనె వేశాక.. ఒక్కోసారి పేలతాయి. అందుకే కార్న్‌ వేగేటప్పుడు కడాయి మీద మూత పెడితే నూనె చిందదు. ఈ స్టార్టర్‌ వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

 పవన్‌ సిరిగిరి, చెఫ్‌ హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని