ఇంట్లోనే పాప్‌కార్న్‌!

సినిమాకి వెళ్లామంటే ఇంటర్వెల్లో పాప్‌కార్న్‌ ఉండాల్సిందే! లేదంటే.. ఏదో వెలితిగా, చప్పగా ఉంటుంది. ఈ పేలాలు థియేటరుకే పరిమితం కాదు.

Published : 29 Oct 2023 00:49 IST

సినిమాకి వెళ్లామంటే ఇంటర్వెల్లో పాప్‌కార్న్‌ ఉండాల్సిందే! లేదంటే.. ఏదో వెలితిగా, చప్పగా ఉంటుంది. ఈ పేలాలు థియేటరుకే పరిమితం కాదు. ఇంట్లోనూ ఇష్టంగా తినేస్తాం. అంత ఇష్టమైన పాప్‌కార్న్‌ బయట కొనుక్కుంటే.. ప్యాకెట్‌ తెరిచాక వెంటనే తినేయాలి. లేదంటే క్రిస్పీనెస్‌ ఉండదు, సాగినట్లవుతాయి. అంతకంటే ముఖ్యంగా.. అవి నిలవుండేందుకు రసాయనాలు ఉపయోగిస్తారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదూ! ఎలాగంటారా.. ఎండు మొక్కజొన్న గింజలు కొన్నిటిని ఒక పాత్రలోకి తీసుకుని.. అందులో ఆలివ్‌ నూనె లేదా వెన్న, కొంచెం ఉప్పు వేసి కలియ తిప్పాలి. వీటిని అవెన్‌కు అనుకూలమైన పేపర్‌ బ్యాగ్‌లో వేసి, చివర్లో మూసేయాలి. ఇప్పుడు అవెన్‌లో పెట్టి, నిమిషం పాటు ఉంచితే సరి.. ఘుమఘుమలాడే వేడివేడి పాప్‌కార్న్‌ సిద్ధం. ఇక తిని ఆనందించడమే తరువాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు