వారెవా చపాతీ రోల్‌

పిల్లల సంగతి అందరికీ తెలిసిందే కదా! ఏ వంటలైనా రెండు మూడుసార్లు చేశామంటే.. మొహం మొత్తేస్తుంది. ఇక తినమని మొరాయిస్తారు. ఎప్పటికప్పుడు సరికొత్త వంటలు కావాలని పేచీ పెడతారు.

Updated : 29 Oct 2023 05:37 IST

పిల్లల సంగతి అందరికీ తెలిసిందే కదా! ఏ వంటలైనా రెండు మూడుసార్లు చేశామంటే.. మొహం మొత్తేస్తుంది. ఇక తినమని మొరాయిస్తారు. ఎప్పటికప్పుడు సరికొత్త వంటలు కావాలని పేచీ పెడతారు. అది కష్టమైన వ్యవహారం కనుక ఉన్నవాటితోనే కొంచెం ప్రయోగాలు చేస్తుండాలి. చపాతీలు తరచూ చేస్తే తినరని.. వాటిని పాలూ, పంచదారల్లో నానబెట్టి స్వీట్‌ చపాతీ చేస్తాం. తుంచి ముక్కలు చేసి ఛాట్‌ తయారుచేస్తాం. అలా నేను ‘చపాతీ రోల్‌’ చేస్తాను. చాలా సులభం.. ముందుగా గోధుమపిండిని తగినన్ని నీళ్లతో బాగా కలిపి మూత పెట్టాలి. కీరా, ఉల్లిపాయలు సన్నగా తరగాలి. క్యారెట్‌ తురుముకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్రలను గ్రైండ్‌ చేయాలి. మెత్తగా కలిపిన గోధుమపిండిని చిన్న చిన్న ఉండలు చేసి.. చపాతీలుగా వత్తుకుని కాల్చుకోవాలి. ఒక్కో చపాతీ మీద నెయ్యి, కొత్తిమీర పేస్టు, మయోనీస్‌ వేసి.. స్ప్రెడ్‌ చేయాలి. దాని మీద కీరా, ఉల్లి ముక్కలను పరిచినట్లు వేయాలి. చివరిగా.. మిక్స్‌డ్‌ హెర్బ్‌ ్స పొడి చల్లి.. చపాతీని రోల్‌ చేయాలి. వీటిని అలాగే తినొచ్చు. నూనెలో వేయించుకునీ తినొచ్చు. ఇవి పిల్లలకీ, పెద్దలకీ కూడా చాలా నచ్చుతాయి. మీరూ ఒకసారి చేసి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని