వంట రానివాళ్లూ చేసేయొచ్చు..

భోజనం అయిపోయాక ఏదైనా స్వీట్‌ తినాలనిపిస్తుంది కదూ! అందుకోసం ఘేవార్‌ను నిమిషాల్లో తయారుచేయొచ్చంటూ ఇండియన్‌ బావార్చీ అకౌంట్‌లో ఓ వీడియో వచ్చింది.

Published : 19 Nov 2023 00:44 IST

భోజనం అయిపోయాక ఏదైనా స్వీట్‌ తినాలనిపిస్తుంది కదూ! అందుకోసం ఘేవార్‌ను నిమిషాల్లో తయారుచేయొచ్చంటూ ఇండియన్‌ బావార్చీ అకౌంట్‌లో ఓ వీడియో వచ్చింది. ఈ రాజస్థానీ డిజర్ట్‌ ఎంత సునాయాసంగా చేశారంటే.. వంట రానివాళ్లు కూడా చేసేయొచ్చు అన్నట్టుంది. కొంచెం మైదా పిండి, కాస్త వెన్న, కొన్ని నీళ్లను తీసుకుని.. ఉండలు కట్టకుండా కలిపి.. కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్యాన్‌లో నెయ్యి వేడయ్యాక.. ఒక అచ్చును (మౌల్డ్‌) మధ్యలో ఉంచి, తయారుచేసుకున్న మిశ్రమాన్ని అందులో పోయాలి. కొన్ని క్షణాల తర్వాత మధ్యలో ఏర్పడిన ఖాళీల్లో ఇంకొంచెం పిండి. వేయాలి. కాలుతున్న ఘేవార్‌ మీద కాస్త నెయ్యి చల్లాలి. బంగారు రంగులోకి వచ్చాక.. అచ్చు నుంచి ఘేవార్‌ను తీసేయాలి. దాని మీద కాస్త పంచదార సిరప్‌ వేసి కొంచెం రబ్డీని అద్దాలి. పైన కొన్ని డ్రైఫ్రూట్స్‌ పలుకులు, కొద్దిగా కుంకుమపువ్వు నీళ్లు, గులాబీ రేకలు వేస్తే సరిపోతుంది. ‘ఇన్‌సేన్‌ రెసిపీ’ పేరుతో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఎంత వైరలైందంటే... ఇప్పటిదాకా కోటిన్నర వీక్షణలూ, దాదాపు పదమూడు లక్షల లైక్స్‌ వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని