స్వీట్‌ కార్న్‌ పరోటా ఇలా చేసి చూడండి..

మా అమ్మాయికి స్వీట్‌ కార్న్‌ పరోటా అంటే చాలా ఇష్టం. నేను చేస్తే సరిగ్గా కుదరడం లేదు. రుచిగా ఉండేందుకు కొన్ని టిప్స్‌ చెప్పండి!

Updated : 26 Nov 2023 03:35 IST

మా అమ్మాయికి స్వీట్‌ కార్న్‌ పరోటా అంటే చాలా ఇష్టం. నేను చేస్తే సరిగ్గా కుదరడం లేదు. రుచిగా ఉండేందుకు కొన్ని టిప్స్‌ చెప్పండి!

  • పరోటాలు గోధుమ, మైదా.. దేంతోనైనా చేయొచ్చు. మైదా వాడితే వేడి మీద మరింత రుచిగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం గోధుమ మంచిది. పైగా ఇవి చల్లారాక కూడా మెత్తగా ఉంటాయి, మైదా పరోటాల్లా సాగవు.
  • పరోటా విరగకుండా, పగుళ్లు లేకుండా చక్కగా రావాలంటే పిండి కలిపేటప్పుడు.. నీళ్లు ఎక్కువ, తక్కువ కాకుండా తగినన్ని పోసి మెత్తగా అయ్యేదాకా బాగా కలపాలి. తడి బట్టతో చుట్టి ముప్పావుగంటసేపు పిండిని నాననివ్వాలి. పిండి గట్టిగా ఉంటే పరోటా వత్తుతున్నప్పుడు లోపలి స్టఫ్ఫింగ్‌ బయటకు వచ్చేస్తుంది.
  • కడాయిలో నూనె వేడయ్యాక.. జీలకర్ర, ఇంగువ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అందులో స్వీట్‌ కార్న్‌, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, వాము, కొత్తిమీరలను మెత్తగా నూరిన ముద్ద వేసి.. కలియ తిప్పుతుండాలి. చెమ్మ ఇంకిపోయింది అనుకున్నాక దించేయాలి.
  • గోధుమపిండిని ముద్దలుగా తీసుకుని పూరీ సైజు రొట్టెలుగా చేయాలి. స్వీట్‌కార్న్‌ మిశ్రమాన్ని నిమ్మకాయంత చొప్పున రొట్టె మధ్యలో ఉంచి.. రొట్టెను మడిచి.. విరగకుండా, స్టఫ్ఫింగ్‌ బయటకి రాకుండా రోల్‌ చేయాలి. ఇవి చపాతీల కంటే మందంగా ఉంటాయి.
  • పెనం వేడెక్కిన తర్వాత నూనె వేసి.. పరోటాలను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

 పవన్‌ సిరిగిరి, చెఫ్‌, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని