గులాబీ టీ తాగేద్దామా...
రంగు రంగుల చూడచక్కని పూలు కనువిందు చేయడంతోపాటు మనసునూ ఆనందంతో నింపేస్తాయి. అంతేకాదు వాటితో తయారుచేసే వివిధ రకాల టీలు చక్కని ఆరోగ్యాన్నీ అందిస్తాయి. మరెందుకాలస్యం మనమూ ప్రయత్నిద్దామా...
గులాబీ టీ
కావాల్సినవి: ఎండిన గులాబీలు- మూడు, గులాబీనీరు- టీస్పూన్, తేనె- రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- అర టీస్పూన్, నీళ్లు- లీటర్, గ్రీన్‌టీబ్యాగ్‌లు- రెండు
తయారీ: పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకలు, నిమ్మరసం వేయాలి. దీన్ని స్టవ్ మీద నుంచి దించి ఎనిమిది నుంచి పది గంటలపాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీరేకలు పూర్తిగా నానిపోతాయి. తర్వాత వాటిని వడకట్టేయాలి. దీంట్లో టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి తేనె, గులాబీనీరు వేసి బాగా కలపాలి. పాలతో కూడా దీన్ని తయారుచేయొచ్చు.
దీంట్లో ఎక్కువగా ఉండే విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తరచూ దగ్గూ, జలుబు బారినపడకుండా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
శంఖుపుష్పాలతో
కావాల్సినవి: శంఖుపుష్పాల రేకలు - అరకప్పు, తేనె- టేబుల్‌స్పూన్, నిమ్మచెక్క- ఒకటి, నీళ్లు- రెండు కప్పులు.
తయారీ: నీళ్లను మరిగించి అందులో శంఖుపుష్పాల రేకలను వేయాలి. తక్కువ మంట మీద కాసేపు మరిగిస్తే రంగు దిగుతుంది. ఈ నీళ్లలో తేనె కలిపితే తేనీరు సిద్ధం అవుతుంది. తర్వాత నిమ్మరసం పిండుకుని వేడిగా తాగేయాలి. అలాగే కొబ్బరినీళ్లు, ఐస్‌క్యూబ్స్ వేసి దీన్ని చల్లగానూ తయారుచేసుకుని తాగొచ్చు.
ఆందోళన, ఒత్తిడిని నియంత్రించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శక్తిస్థాయులను పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్త్తుంది.
గోంగూరపూలతో
కావాల్సినవి: ఎండిన గోంగూరపూలు- ఆరు, నీళ్లు- రెండు కప్పులు, తేనె- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: నీళ్లను బాగా మరిగించి దాంట్లో గోంగూరపూల రేకలను వేయాలి. స్టవ్ ఆపేసి గిన్నె మీద మూతపెట్టి ఐదు నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. అప్పుడు పూలలోని సారమంతా నీళ్లలోకి దిగుతుంది. చివరగా తేనె కలిపితే సరిపోతుంది.
వీటిల్లో విటమిన్-ఎ, సి, ఇనుము, జింక్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు అంతర్గత వాపులను నియంత్రిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సోలోగా సదా.. క్యూట్‌గా ఐశ్వర్య.. గులాబీలతో నభా!
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ
-
India News
Rahul Gandhi: ‘ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి’.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం
-
Sports News
IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్’ ఎక్కించింది.. ‘సుడులు’ తిప్పిన బౌలర్లు
-
Politics News
Nara Lokesh: వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం: నారా లోకేశ్
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం