నిమ్మగడ్డి వేసవి చిక్కులకు చెక్‌ పెట్టేస్తుంది!

చూడ్డానికి మామూలు గడ్డిలా అనిపించినా నిమ్మగడ్డి లేదా లెమన్‌గ్రాస్‌కి ప్రత్యేకమైన పరిమళం ఉంటుంది. దీంతో చేసిన టీ ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..

Published : 08 May 2022 00:17 IST

చూడ్డానికి మామూలు గడ్డిలా అనిపించినా నిమ్మగడ్డి లేదా లెమన్‌గ్రాస్‌కి ప్రత్యేకమైన పరిమళం ఉంటుంది. దీంతో చేసిన టీ ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..

* ఈకాలంలో ఆహారాన్ని సరిగా నిల్వచేయకపోతే ఈ-కొలి బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది. అలాంటి పదార్థాలు తినడం వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. నిమ్మగడ్డితో చేసిన టీ మన శరీరంలో చేరిన బ్యాక్టీరియాని పేగుల్లోనే చంపేసి, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.

* ఎప్పుడైనా ఆందోళనగా, విచారంగా అనిపించినప్పుడు వేడివేడిగా, నిమ్మగడ్డితో చేసిన టీని తాగి చూడండి. ఎంత ఉపశమనంగా ఉంటుందో! దీనిని చేయడం చాలా తేలిక. బజారులో ఎండబెట్టిన లెమన్‌ గ్రాస్‌ దొరుకుతుంది. దీనిని చెంచా తీసుకుని గ్లాసు నీళ్లలో మరిగించి, వడకట్టుకోవాలి. తర్వాత తగినంత పంచదార కలిపితే సరి. టీ సిద్ధం. ఇది కొలెస్ట్రాల్‌నీ అదుపులో ఉంచుతుంది.

* చాలాదేశాల్లో ఈ ఆకులని భోజనం తర్వాత నములుతుంటారు. ఇలా నమలడం వల్ల నోట్లోని దుర్వాసన పోవడమే కాక, పళ్లలో రంధ్రాలు రావటానికి కారణమైన బ్యాక్టీరియా నశించిపోతుంది.

* నెలసరికి ముందు కొందరిలో పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది. అలాంటి వారికి నిమ్మగడ్డితో చేసిన టీ మంచి ఉపశమనం ఇస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని