రోజుకో లడ్డు తింటే... అందం... ఆనందం!

చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పేలవంగా మారుతుంది. జుట్టు పీచులా తయారవుతుంది.

Updated : 18 Dec 2022 14:25 IST

పోషకాలం

చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పేలవంగా మారుతుంది. జుట్టు పీచులా తయారవుతుంది. ఇవే కాదు చలికాలంలో మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో! వాటన్నింటికీ చక్కని పరిష్కారం అంటే నువ్వులే!

* వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే జింక్‌ పుష్కలంగా అందాలి. కాసిని నువ్వులు తిన్నా.. రోజువారీ అవసరాలకు కావాల్సిన జింక్‌ అంది శరీరంలో నిరోధకశక్తి పెరుగుతుంది. సాధారణంగా చలికాలం ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, జ్వరం వంటివి రాకుండా నువ్వులు అడ్డుకుంటాయి. అందుకే వేపుళ్లు చేసేటప్పుడు వేయించిన నువ్వుల పొడిని వేస్తే సరి.
* మన మూడ్‌ని మార్చే శక్తి నువ్వులకి ఉంది. మనలో సెరటోనిన్‌ అనే రసాయనమే ఆందోళన, ఒత్తిడి కలగడానికి కారణమవుతుంది. ఆ రసాయనంలో హెచ్చుతగ్గులు లేకుండా చేసి మనల్ని సంతోషంగా ఉంచుతాయి నువ్వులు.
* రోజూ ఒక నువ్వుల లడ్డు తినేవారు థైరాయిడ్‌ సమస్యలతో తేలిగ్గా పోరాడొచ్చు. థైరాయిడ్‌ గ్రంథి పనితీరుని నువ్వులు మెరుగుపరుస్తాయి.
* కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఆ బాధనుంచి ఉపశమనం పొందడానికి రోజువారీ నువ్వుల వాడకం ఎంతగానో ఉపకరిస్తుంది.
* నువ్వుల్లోని ఒమెగా కొవ్వులకి శక్తినీ, ఉత్సాహాన్ని ఇచ్చే శక్తి ఉంది. అందుకే ఉత్సాహంగా ఉండాలనుకొనేవారు ఒక నువ్వుల లడ్డు తింటే చాలు.
* ఎండబారిన పడినప్పుడు సూర్యకిరణాల్లోని అతినీలలోహిత కిరణాల బారినపడకుండా చేసే శక్తి నువ్వులకి ఉంది. నువ్వుల నూనె ఒంటికి రాసినా, వంటల్లో వాడినా జుట్టు వేగంగా నెరవదు. చర్మం ఎన్నేళ్లైనా నిగారింపుతో ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు