పిప్పిని పిండి చేస్తున్నారు!

ఆరోగ్య, పర్యావరణ స్పృహ పెరగడంతో బర్రెపాలు, ఆవుపాల స్థానంలో బాదంపాలు, సోయాపాలు ఇలా రకరకాల ఫ్లేవర్లు అందుబాటులోకి వస్తున్నాయి.. తెలిసిందేగా!

Published : 18 Jun 2023 00:15 IST

రోగ్య, పర్యావరణ స్పృహ పెరగడంతో బర్రెపాలు, ఆవుపాల స్థానంలో బాదంపాలు, సోయాపాలు ఇలా రకరకాల ఫ్లేవర్లు అందుబాటులోకి వస్తున్నాయి.. తెలిసిందేగా! బాదం, సోయా, ఓట్స్‌ నుంచి ఆ పాలు తీసిన తర్వాత ఆ పిప్పిని ఏం చేస్తారు? ఇంతవరకూ ఆ పిప్పికి పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఆహార వృథాని అరికట్టే క్రమంలో.. ఆ పిప్పినీ అప్‌సైకిల్డ్‌ ఫ్లోర్‌ పేరుతో పిండిగా మార్చేస్తున్నారు. కాస్త ముదురు రంగులో ఉండే పిండిని పిజా బేస్‌లు మొదలుకుని వివిధ రకాల ఉత్పత్తుల్లో మైదాకు బదులు వాడుతున్నారు. ఈ ఏడాది ఇదో ట్రెండ్‌గా కూడా మారింది. మనం నువ్వుల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన తెలక పిండిని వంటల్లో వాడినట్టుగా అన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని