సోలాపుర్‌ సెనగ చట్నీ!

హైదరాబాద్‌ బిర్యానీ, ఆగ్రా పెటా, ముంబయి వడాపావ్‌ ఈ జాబితాలోకి.. సోలాపుర్‌ సెనగ చట్నీ కూడా చేరింది.

Published : 28 Aug 2022 00:23 IST

హైదరాబాద్‌ బిర్యానీ, ఆగ్రా పెటా, ముంబయి వడాపావ్‌ ఈ జాబితాలోకి.. సోలాపుర్‌ సెనగ చట్నీ కూడా చేరింది. సోలాపుర్‌లో తయారైన సెనగ చట్నీకి దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగానూ డిమాండ్‌ పెరుగుతోంది..

సోలాపుర్‌ ప్రాంతం ఒకప్పుడు చద్దర్లు, దుప్పట్లకి పెట్టింది పేరు. ప్రస్తుతం మాత్రం వేరుసెనగ విత్తనాలతో తయారైన చట్నీకి పేరు. సుమారుగా 5000 మంది ఈ పచ్చడి తయారీతోనే ఉపాధి పొందుతున్నారు. పొడవైన గుజరాతీ పల్లీలు, వెల్లుల్లి, బ్యాడిగీ రకం మిర్చీలు వేసి చేసిన వేరుసెనగ పొడినే ఇక్కడ సెనగ చట్నీ అంటారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా ఏర్పడి... ఎంతోమంది మహిళలు యంత్రాలను తక్కువ వినియోగిస్తూ ఈ సెనగ చట్నీని తయారుచేసి విక్రయిస్తుంటారు. స్థానికులు.. జొన్నరొట్టె, పెరుగుతో కలిపి సెనగ చట్నీని తింటే అమోఘం అంటారు. వివిధ వంటకాల్లోకి కూడా ఈ చట్నీ కాంబినేషన్‌ బాగుండటంతో ఎంతోమంది ఈ పొడిని కొనుగోలు చేస్తుంటారు. విదేశాల్లో ఉండేవారికీ ఇక్కడ నుంచి ఆర్డర్లు వెళ్తుంటాయి. రోజూ టన్నుల కొద్దీ సెనగచట్నీ అమ్ముడవుతోందట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని