ధర అల్పం.. లాభాలధికం

దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి.. వింటేనే నోరూరుతుంది. అల్లం దట్టించి కూర చేసినా, ఇతర కూరగాయలతో కలిపి వండినా వహ్వా అనిపిస్తుంది. ఏడాది పొడవునా దొరికే దోస రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

Published : 05 Feb 2023 00:44 IST

దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి.. వింటేనే నోరూరుతుంది. అల్లం దట్టించి కూర చేసినా, ఇతర కూరగాయలతో కలిపి వండినా వహ్వా అనిపిస్తుంది. ఏడాది పొడవునా దొరికే దోస రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇదెంత మేలు చేస్తుందో చూద్దాం...

* దోసలో విటమిన్లు, ప్రొటీన్లు, పీచు, మాంగనీస్‌, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియంలు ఉన్నందున మంచి పోషకాహారం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

* ఇందులో క్యాల్షియం, విటమిన్‌-కె అధికంగా ఉన్నందున ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. అధికశాతం నీరు ఉంటుంది కనుక డీహైడ్రేషన్‌ సమస్య రాదు.

* యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్‌, యాంటీక్యాన్సర్‌ గుణాలు ఉన్నందున క్యాన్సర్‌తో సహా అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం మీద చేరిన మలినాలు, మృతకణాలు నశించి మెరుపు వస్తుంది.

* రక్తపోటును, బ్లడ్‌సుగర్‌ను నివారిస్తుంది. టాక్సిన్స్‌ను నివారిస్తుంది. పీచు పదార్థం అధికంగా ఉన్నందున శరీరంలో చేరిన వ్యర్థాలు తొలగుతాయి. కళ్లకు చలవ చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు