Charles III: పట్టాభిషేకానికి.. పాలకూర!
రాజుగారి పట్టాభిషేకం అంటే మాటలా? దేశవిదేశాల నుంచి వచ్చే వేలమంది అతిథులు, వాళ్లకి వండివార్చే విందు భోజనాలతో చాలా హడావుడి ఉంటుంది.
రాజుగారి పట్టాభిషేకం అంటే మాటలా? దేశవిదేశాల నుంచి వచ్చే వేలమంది అతిథులు, వాళ్లకి వండివార్చే విందు భోజనాలతో చాలా హడావుడి ఉంటుంది. నోరూరించే వంటకాలు ఎన్ని వండినా, పట్టాభిషేకంలో వండే ప్రధాన వంటకం గురించే ఇప్పుడు చర్చంతా..!
ఎలిజిబెత్ రాణి పట్టాభిషేక సమయంలో వండిన కొరోనేషన్ చికెన్ గురించి ఇప్పటికీ కథలుకథలుగా చెప్పుకొంటారు అక్కడి ప్రజలు. ఆ వంటకాన్ని ఎలా వండాలి అనేదానిపై చర్చలు కూడా జరుగుతూ ఉండేవి. 1953లో రాణి పట్టాభిషేకం జరిగినప్పుడు రాచకుటుంబం నుంచి ప్రతి ఇంటికి కిలో పంచదార, పావుకిలో వెన్నని అందించారట. వాటితో ప్రతిఒక్కరూ కేకులు, పేస్ట్రీలు చేసుకుంటారని. ఇక కొరోనేషన్ చికెన్ అయితే మామూలుగా ప్రాచుర్యంలోకి రాలేదు. 90ల వరకూ వంటల పోటీల్లో కింగ్ అదే. ప్రస్తుత మూడో ఛార్లెస్ పట్టాభిషేకానికి ఏడు టన్నుల మాంసాన్ని, 1600 కోళ్లని, ఎనిమిది వేల గుడ్లని వడ్డిస్తున్నారు. రాజుగారి కోరిక మేరకు కోరోనేషన్ క్విచె వంటకాన్ని ప్రధానంగా వండుతున్నారు. పాలకూర, చిక్కుడు కాయలు, చీజ్, క్రీంలతో చేసే ఆరోగ్యకరమైన వంట ఇది. పర్యావరణానికి మేలుచేస్తూ, స్థానికంగా దొరికే కూరగాయలతో చేసిన వంటకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నది ఛార్లెస్ ఉద్దేశమట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు