కదిలే క్రిస్మస్‌ చెట్లు!

రంగు రంగుల్లో వంపులు తిరిగి కనిపిస్తున్న ఈ చెట్లన్నీ క్రిస్మస్‌ ట్రీలేనండోయ్‌. ‘అదేంటీ, రకరకాల అలంకరణలతో చేసిన వెలుగుల క్రిస్మస్‌ చెట్లను చూశాం కానీ ఇలాంటి వాటిని ఎక్కడా చూడలేదే’ అంటారా... ఎలా చూస్తారూ... ఇవి ఉండేది సముద్ర లోతుల్లోని పగడపు దిబ్బలపైన మరి.

Updated : 25 Dec 2022 04:16 IST

కదిలే క్రిస్మస్‌ చెట్లు!

రంగు రంగుల్లో వంపులు తిరిగి కనిపిస్తున్న ఈ చెట్లన్నీ క్రిస్మస్‌ ట్రీలేనండోయ్‌. ‘అదేంటీ, రకరకాల అలంకరణలతో చేసిన వెలుగుల క్రిస్మస్‌ చెట్లను చూశాం కానీ ఇలాంటి వాటిని ఎక్కడా చూడలేదే’ అంటారా... ఎలా చూస్తారూ... ఇవి ఉండేది సముద్ర లోతుల్లోని పగడపు దిబ్బలపైన మరి. పైగా ఎవరూ చేసిపెట్టిన చెట్లు కావివి, ప్రాణమున్న జీవులు. అచ్చంగా క్రిస్మస్‌ చెట్లను పోలి ఉంటాయి కాబట్టి వీటికి ‘క్రిస్మస్‌ ట్రీ వార్మ్స్‌’ అని పేరు పెట్టారు. తెలుపు, ఎరుపు, కాషాయం, పసుపు, నీలం... ఇలా అన్ని వర్ణాల్లో అందంగా మెరిసిపోతూ ఉండే ఈ సముద్రపు జీవులు కదులుతూ ఉంటే- చూడ్డానికి ‘అరె క్రిస్మస్‌ చెట్లే అటూ ఇటూ కదులుతున్నాయా’ అన్నట్టు చిత్రంగా కనిపిస్తాయి. నీటి లోపల చిన్న చిన్న మొక్కల్ని తిని పొట్ట నింపుకొనే ఇవి శత్రు జీవుల్ని బోల్తా కొట్టించడానికే ఇలా వింత రూపంతో ఉంటాయట. పెద్ద జీవి నీడ పడినా బొరియల్లోకి తుర్రుమంటాయట. ఏది ఏమైనా... నీటి లోపల ఉన్న ఈ బుల్లి బుల్లి క్రిస్మస్‌ చెట్లు చూడముచ్చటగా ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..