పురుషోత్తమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 24 వది. పురుషులలో ఉత్తముడు అన్నది సామాన్యార్థం. పురుషులు మూడు రకాలుగా ఉంటారు. బద్ధ, నిత్య, ముక్తులు అనే ఆ మూడు రకాల్లో ఉత్తముడు కనుక పురుషోత్తముడయ్యాడు

Updated : 14 Mar 2023 14:11 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 24 వది. పురుషులలో ఉత్తముడు అన్నది సామాన్యార్థం. పురుషులు మూడు రకాలుగా ఉంటారు. బద్ధ, నిత్య, ముక్తులు అనే ఆ మూడు రకాల్లో ఉత్తముడు కనుక పురుషోత్తముడయ్యాడు. క్షరుడు (నశించేవాడు), అక్షరుడు (వినాశన రహితుడు) అనే ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరి కంటే ఉత్తముడైనవాడు ఆ స్వామి అనేది ఇందులోని భావం.

 వై.తన్వి


శ్లోకామృతమ్‌

జితేంద్రియత్వం వినయస్య కారణం
గుణప్రకర్షో వినయాదవాప్యతే
గుణాధికే పుంసి జనోనురజ్యతే
జనానురాగప్రభవా హి సంపదః

ఇంద్రియాలను జయించినప్పుడే వినయం సాధ్యమవుతుంది. వినయ స్వభావం ఉన్నప్పుడే తక్కిన సద్గుణాలు అలవడతాయి. అలాంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తిని లోకం ఒప్పుకుంటుంది. లోకుల అభిమానం, ఆదరం ఉన్నప్పుడే సకల సంపదలూ సిద్ధిస్తాయనేది శ్లోక భావన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని