చిన్నా - పెద్దా

వారధి నిర్మాణంలో సాయ పడిన ఉడుతని శ్రీరాముడు ప్రేమగా నిమురుతుంటే వానరసేన అసూయగా చూసింది.

Updated : 14 Mar 2023 13:12 IST

వారధి నిర్మాణంలో సాయ పడిన ఉడుతని శ్రీరాముడు ప్రేమగా నిమురుతుంటే వానరసేన అసూయగా చూసింది. అది గమనించిన రాముడు- ‘సృష్టిలో చిన్న ప్రాణుల్ని పెద్దవి, ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు ఇతరులను చులకన చేయడం సాధారణం. ఒక ఉదాహరణ చెబుతాను.. ఒకసారి ఇలాంటి ఉడుతే కొండ మీదున్న చెట్టు ఎక్కుతోంది. అది చూసిన కొండ వేలెడంత లేవంటూ హేళన చేసింది. ‘నిజమే పర్వత రాజా! నాకు నీ అంత భారీ శరీరం లేదు. నీలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించ లేను. కానీ ఈ సృష్టి సక్రమంగా కొనసాగడానికి నాలాంటి అల్ప జీవులు కూడా అవసరమే. మండే ఎండలు, కుండపోత వానలు, గడ్డ కట్టించే శీతలత్వం- ఇలా అన్ని రుతువులూ కలిస్తేనే సంవత్సరం కదా! నేను అల్ప జీవిననే భావం నన్నెప్పుడూ బాధించలేదు. నేను నీలా కొండను కాలేను. నువ్వు నాలా చిన్న ఉడుతవీ కాలేవు. నా చురుకుదనం, వేగం నీకు లేనట్లే నీలా నేను చెట్లను మోయలేను. సృష్టిలో దేని సామర్థ్యం దానిదేనని గ్రహించు’- అంది’ అంటూ హితబోధ చేశాడు.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని