మంత్రం.. యంత్రం.. తంత్రం!
మంత్రం దేవతా శబ్దరూపం. దైవానుగ్రహం పొందటానికీ, ఆధ్యాత్మిక ఉన్నతికీ మంత్రాలను జపించటం వేదకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. మంత్రాల్లో కొన్ని ఉపకారం చేసేందుకు ఉద్దేశించినవి.
మంత్రం దేవతా శబ్దరూపం. దైవానుగ్రహం పొందటానికీ, ఆధ్యాత్మిక ఉన్నతికీ మంత్రాలను జపించటం వేదకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. మంత్రాల్లో కొన్ని ఉపకారం చేసేందుకు ఉద్దేశించినవి. కొన్ని విధ్వంససాధనాలుగా, ఆయుధాలుగా ఉపయోగపడేవి. అక్షరాల సంఖ్యను బట్టి మంత్రాలకు పేర్లున్నాయి. 6 అక్షరాలుంటే బాల, 12 వర్ణాలుంటే కౌమారి, 15 అక్షరాల మంత్రాన్ని యౌవని, 24 అక్షరాలుంటే వృద్ధ అంటారు. అక్షరాల పరిమితి లేకుంటే అది మాలామంత్రం.
మంత్రానికి రేఖారూపమైన చిహ్నం యంత్రం. ఇది దేవతను ఆవహించి ఆరాధించే కేంద్రం, ఆలంబన. బీజాక్షరా లతో కూడిన చక్రం. సరళరేఖలు, త్రిభుజాలు, బహు భుజాలు, వృత్తాలు, కోణాలతో రూపొందిన యంత్రంలో ఆయా దేవతాశక్తుల బీజాక్షరాలుంటాయి. ఇవి రాగిరేకులపై లిఖించి ఉంటాయి. ఆలయాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు పీఠం దిగువన విధిగా యంత్రం ఉంటుంది. అందులో ఆ దేవతకు సంబంధించిన బీజాక్షరాలుంటాయి. మంత్ర, యంత్ర రెండింటి శక్తి కలిగింది విగ్రహం. ఇక ఆరాధన, ఉపాసనా ప్రక్రియ, విశేషాలను తెలియజేసేది తంత్రం. అంటే మంత్ర, యంత్ర ఉపాసనా జ్ఞానమే తంత్రం. ఒక్కమాటలో చెప్పా లంటే దేవతలూ, ప్రకృతి శక్తులను వశం చేసుకోవడానికి ఉద్దేశించిన మంత్రాలు, చక్రాలు తదితర అంశాల వివరణే తంత్రం. ఇవన్నీ శాస్త్రీయ నిరూపణలతో కూడిన పదాలు. మన మహర్షులు సాధనతో వీటిని ఆవిష్కరించారు.
ప్రహ్లాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన