మాట్లాడేందుకు నిదానించు!

‘వినడానికి వేగిరపడు, మాట్లాడేందుకు నిదానించు’ (యాకోబు 1:9) అనేది ఏసుప్రభువు సందేశం. కానీ మనలో చాలామంది ఈ మాటను పాటించరు.

Published : 15 Jun 2023 00:52 IST

‘వినడానికి వేగిరపడు, మాట్లాడేందుకు నిదానించు’ (యాకోబు 1:9) అనేది ఏసుప్రభువు సందేశం. కానీ మనలో చాలామంది ఈ మాటను పాటించరు. అవసరం ఉన్నా లేకున్నా, శ్రోతలు విన్నా, వినకపోయినా తమ ధోరణిలో ఏదో ఒకటి చెబుతుంటారు. ఎదుటివారి బదులు కూడా తామే బదులిస్తుంటారు. ఇది మంచిది కాదని, తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని గుర్తించరు. తాము గొప్ప వక్తలమని స్వీయ ప్రశంసాపత్రాలు ఇచ్చుకుని ఆనందించడం మానేసి తమ మాటలకు ఎదుటివాళ్లు స్పందిస్తున్నారో లేదో మొదట గమనించుకోవాలన్న ప్రభువు మాట ఎంత ఉత్కృష్టమైందో అర్థం చేసుకుంటే మన అవివేకం తొలగిపోతుంది. సమయోచితంగా, క్లుప్తంగా ఉండే మాటలు (సామెతలు 25:11) వెండిపళ్లెంలో బంగారు పండులా భాసిస్తాయి. అలాగే ఏ ఇద్దరైనా దూరంగా వెళ్లి మాట్లాడుకుంటున్న సమయంలో వారి ఏకాంతానికి భంగం కలిగించడం, రహస్యాలను వినాలనుకోవడం దేవుడి దృష్టిలో తప్పిదమే. నిజమైన క్రైస్తవులకు ఇది గొప్ప సందేశం.

 మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని