అదే శాంతికి చిరునామా

‘అనన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసితే’ అంటోంది భగవద్గీత. ఎవరైతే అన్య చిత్తం గాక అనన్య చిత్తంతో ఉపాసిస్తారో వారిని సంసార సాగరం నుంచి కృష్ణపరమాత్ముడు ఉద్ధరిస్తాడన్నది భావం.

Updated : 14 Feb 2024 19:53 IST

నన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసితే’ అంటోంది భగవద్గీత. ఎవరైతే అన్య చిత్తం గాక అనన్య చిత్తంతో ఉపాసిస్తారో వారిని సంసార సాగరం నుంచి కృష్ణపరమాత్ముడు ఉద్ధరిస్తాడన్నది భావం. పొలం శుద్ధి చేయకుండా విత్తనాలు మొలకెత్తవు. పునాది గట్టిగా లేకుంటే సౌధం నిలవదు. అలాగే మనసు శుద్ధి చేసుకోకుండా దైవ సాక్షాత్కారం లభించదు. మన ధ్యానం, ఉపాసన ఆనందకర విషయాలే గానీ బలవంతంగా చేసేవి కాదు. ఎవరి కోసమో భక్తి ముసుగు వేయకూడదు. ఆ తాదాత్మ్యం ఎవరికి వారు అనుభవించాలి. అన్యచిత్తం లేకుండా ధ్యానించడమే అనన్యయోగం.
శత్రుమిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, నిందాస్తుతులు, సుఖదుఃఖాల్లో సమస్థితి చూపడం, ఎలాంటి కోరికలూ లేకపోవడం, మౌనం, నిశ్చలబుద్ధి, నిర్మలభక్తి.. ఇవే తనకు అత్యంత ఇష్టమన్నది భగవద్వచనం. క్షణక్షణం పరివర్తన చెందే సమాజంలో ఈ గుణాలు అలవరుచుకుంటే శాంతి సంతృప్తులతో జీవించవచ్చు. దైవసాక్షాత్కార అనుభూతి పొందవచ్చు.

 శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని