దానం.. దక్షిణ..

ఒకసారి చంద్రగుప్తుడు మగధ రాజ్యంపై దండయాత్రకు వెళ్లాడు. మధ్యలో నందిగ్రామం అనేచోట సైన్యంతో బసచేశాడు. గ్రామవాసులు వారికి భోజనాలు ఏర్పాటు చేశారు.

Published : 17 Aug 2023 00:07 IST

కసారి చంద్రగుప్తుడు మగధ రాజ్యంపై దండయాత్రకు వెళ్లాడు. మధ్యలో నందిగ్రామం అనేచోట సైన్యంతో బసచేశాడు. గ్రామవాసులు వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. దండయాత్ర ముగిసి రాజమందిరం చేరాక మంత్రి చాణక్యుడు రాజును కలిశాడు. మాటల్లో ‘నందిగ్రామ వాసుల భోజనం తమరు తిన్నారా?’ అనడిగాడు. తిన్నానని రాజు చెప్పగా ‘ఆ భోజనానికి పైకం చెల్లించారా?’ మళ్లీ ప్రశ్నించాడు మంత్రి. లేదన్నాడు చంద్రగుప్తుడు. ‘ఏ ఉద్దేశంతో భోజనం స్వీకరించావు రాజా? ఆహారాన్ని వాళ్లు దానం చేశారా? దక్షిణగా ఇచ్చారా?’ అని నర్మగర్భంగా అడిగాడు చాణక్యుడు. రాజు అయోమయంతో ముఖం తేలేశాడు. అప్పుడు చాణక్యుడు శిష్యుడు సారంగను పిలిచి దానం, దక్షిణలకు మధ్య తేడా ఏంటో చెప్పమన్నాడు. ‘దానం అంటే సామాజిక కర్తవ్యంగా ఇతరులకు ఇచ్చేది.. అంటే యాచకులకు దయతో ఇచ్చేది. దక్షిణ అంటే మనం పొందిన సేవలకుగాను కృతజ్ఞతతో ఇచ్చేది... విద్యనేర్పిన గురువులకు, మన పేరిట పూజలు చేసిన పురోహితులకు చెల్లించేది!’ అంటూ చెప్పాడు శిష్యుడు. అది విన్న చంద్రగుప్తుడు ఎలాంటి రాజదర్పం లేకుండా ‘మంత్రివర్యా! నన్ను మన్నించు. అక్కడ తిన్న ఆహారానికి తక్షణమే పైకం చెల్లిస్తాను’ అన్నాడు వినయంగా. 

ప్రహ్లాద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని