ఆదర్శప్రాయుడు దావీదు

ఒకసారి ఏసుప్రభువు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ.. ‘నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా?’ అనడిగాడు.

Published : 19 Oct 2023 00:16 IST

కసారి ఏసుప్రభువు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ.. ‘నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా?’ అనడిగాడు. నిజమే.. పాపం, మోసం  అనేవి లేకుండా జీవించడం ఈ లోకంలో అసాధ్యమే. ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ- మాట, ఆలోచన, క్రియ.. ఇలా ఏదో రూపంలో పాపం చేస్తూ దేవుడికి దూరమవుతూనే ఉంటాం. కానీ పరిశుద్ధత లేకుండా దేవుడి ఇష్టానికి పాత్రులమవడం అసాధ్యం. కనుక మనం చెడు జోలికి వెళ్లకుండా నిరంతరం అప్రమత్తులమై ఉండాలి. ‘నేను పరిశుద్ధుడనై ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి’ అన్నాడు ఏసు. మానవమాత్రులమైన మనకు అలా ఉండటం కష్టం కనుక.. దేవుడి వాక్యాన్ని స్మరించుకోవడం ద్వారానే సాధ్యం చేసుకోవాలి. అందుకే భక్తుడైన దావీదు మహారాజు ‘నేను పాపం చేయకుండా ఉండాలని హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను’ అంటూ ప్రార్థించాడు. ఆయనే మనకు ఆదర్శం. పాపం చేయని దేవుడు మన కోసం పాపిగా నిందారోపణకు గురయ్యాడు. సిలువలో రక్తం కార్చాడు. ఆ ఏసుప్రభువు రక్తం మన పాపాలను ప్రక్షాళన చేసి పవిత్రత చేకూరుస్తుంది.

స్టెర్జి రాజన్‌ బందెల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని