ఆత్మసాక్షాత్కారం అంటే..

మానవ జన్మకు సార్థకత గురించి ఆలోచించి, అంతిమ గమ్యాన్ని చేరుకునే దిశగా ఆలోచిస్తే.. ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది అనే విషయం అర్థమవుతుంది. ఆ ఆత్మ మీద ఎండ, వాన, అగ్ని మొదలైన వాటి ప్రభావం ఎంత మాత్రం ఉండదనేది అక్షర సత్యం.

Published : 26 Oct 2023 00:04 IST

మానవ జన్మకు సార్థకత గురించి ఆలోచించి, అంతిమ గమ్యాన్ని చేరుకునే దిశగా ఆలోచిస్తే.. ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది అనే విషయం అర్థమవుతుంది. ఆ ఆత్మ మీద ఎండ, వాన, అగ్ని మొదలైన వాటి ప్రభావం ఎంత మాత్రం ఉండదనేది అక్షర సత్యం. మనలో ఉన్న ఆత్మను అనుభూతి పరంగా తెలుసు కోవటమే ఆత్మసాక్షాత్కారం. భగవంతుడు తన శక్తితో ఏడు చక్రాలు, మూడు నాడులు, కుండలినీ శక్తి, ఆత్మ అనే శరీర వ్యవస్థను ఎంతో నేర్పుగా, అందంగా మనలోపలే భద్రపరిచాడు. వెన్నెముకలోని ఒక ఎముకలో కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని  బాహ్యంగా కనిపించే చైతన్యంతో అనుసంధానం చేయడమే ఆత్మ సాక్షాత్కారం. సహజయోగ సాధనలో జరిగేది అదే. ఈ సహజ యోగను పూజ్య మాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించారు. దీన్ని మనం చేతులు, తల పై భాగాన వచ్చే చైతన్య తరంగాల ద్వారా అనుభూతిపరంగా స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు.

ఆనందం మనలోనే ఉంటుంది. ఆత్మానందానికి మించిన సత్యం లోకంలో మరొకటి లేదు. దీని కోసమే మనం అన్వేషిస్తుంటాం. ఆత్మ సాక్షాత్కారం పొందాలనే భగవంతుడు మనకీ జన్మ ప్రసాదించాడు- అంటారు మాతాజీ. అప్పుడే మనలో రాగద్వేషాలు, అసూయ, పగ, ప్రతీకారం, హెచ్చుతగ్గులు, తారతమ్యాలు- లాంటివన్నీ అంతరిస్తాయి. సహజయోగ పూర్తిగా ఉచితం. ఎవరైనా, ఎప్పుడైనా సునాయసంగా నేర్చుకుని సాధన చేసుకోవచ్చు. శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక.. సమస్యలు వేటికైనా చక్కటి పరిష్కారం సూచిస్తుందిది.

(సహజ యోగ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) 

డా.పి.రాకేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని