పోషణ ఒకటే.. వైఖరి వేరు..

‘ఒక ఇంట్లో పిల్లి కుక్క ఉన్నాయి. అవి ఒకరోజు ఇలా మాట్లాడు కుంటున్నాయి.. ముందుగా కుక్క ‘యజమాని నన్నెంతో ముద్దుగా చూస్తాడు. వారి పిల్లలు నాతో ఆడుకుంటూ మంచి భోజనం పెడతారు

Published : 14 Dec 2023 00:05 IST

‘ఒక ఇంట్లో పిల్లి కుక్క ఉన్నాయి. అవి ఒకరోజు ఇలా మాట్లాడు కుంటున్నాయి.. ముందుగా కుక్క ‘యజమాని నన్నెంతో ముద్దుగా చూస్తాడు. వారి పిల్లలు నాతో ఆడుకుంటూ మంచి భోజనం పెడతారు. నన్ను అందంగా అలంకరిస్తారు. నా ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల వాళ్లని దేవుళ్లుగా భావిస్తాను’ అంది. పిల్లి మరింత ఉత్సాహంగా ‘నన్ను ఇంకా ముద్దుగా చూస్తారు. ఒడిలో పెట్టుకొని మురిసిపోతారు. రోజూ చిక్కటి పాలు పోస్తారు. వాళ్లకి నేనే దేవుణ్ణి తెలుసా?!’ అంది. రెండిటికీ జరిగిన పోషణ ఒకటే. కానీ వాటి మనోవైఖరిలో మాత్రం ఎంతో మార్పు ఉంది. ఒకటి వినయం చూపితే, రెండోది అహంభావం ప్రదర్శించింది. మనకెవరైనా సాయం చేస్తే వారిని దైవంగా పూజించవచ్చు. కానీ నా గొప్పతనం చూసి వారు సాయం చేశారనుకుంటే అది అహంకారం. ఇది మనలో ఎంతమాత్రం ఉండకూడని లక్షణం’ అంటూ కథ రూపంలో శిష్యులకు వివరించారో గురువు.

శివలెంక ప్రసాదరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని