అంత్యకాలంలో దేవుడు గుర్తు రావాలంటే..

శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో..

Published : 08 Feb 2024 00:06 IST

శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో..

అన్తకాలే చ మామేవ స్మరన్‌ ముక్త్వా కలేవరమ్‌
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః

అవసాన కాలంలో ఎవరు నన్నే స్మరిస్తూ దేహాన్ని విడుస్తారో, వారు నన్ను చేరుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు’ అన్నాడు. ఇక్కడ అంత్యకాలం అంటే.. స్పృహ ఉన్నంత వరకూ,  చివరి దశలో కూడా- అని అర్థం. జీవితమంతా, స్పృహ ఉన్నంత వరకూ భగవంతుణ్ణి ధ్యానించేవారికి సద్గతి కలుగుతుంది. ఎవరికి ఎప్పుడు అంత్యకాలం వస్తుందో తెలియదు కనుక నిరంతరం దైవ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఆ సంస్కార ఫలంగా మనసు పక్కకు మళ్లినప్పుడు, నోట మాటపడిపోయినప్పుడు కూడా సూక్ష్మశరీరంలో ఆ నామప్రభావం ఉంటుంది. ప్రాణం విడుస్తున్నప్పుడు కూడా ‘హే రామ్‌’ అని పలవరించారు మహాత్మాగాంధీ. ‘బతికినన్నాళ్లూ నీ భజన తప్పను గాని, మరణ కాలమందు మరుతునేమొ..’ అన్నాడు శేషప్ప కవి నరసింహ శతకంలో. ‘యముడు పంపిన దూతలు అమితమైన ఆగ్రహంతో వచ్చి నా ప్రాణాలు తీసుకెళ్తున్నప్పుడు.. కఫ, వాత, పైత్యం కమ్మి దిక్కుతోచక నేను వణుకు తున్నప్పుడు, ఆయాసపడుతూ ఈ నాలుకతో నిన్ను పిలవగలనో లేదో అందుకే అప్పటికీ, ఇప్పటికీ కలిపి ఒక్కసారే భక్తితో నీ పేరును స్మరిస్తాను. నన్ను కాపాడుకో స్వామీ’ అంటూ నృసింహస్వామిని వేడుకున్నారాయన. 

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని