దేవుడి గదిలో దీపం ఎందుకు వెలిగించాలి?

భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కొందరు పొద్దున వెలిగిస్తే మరి కొందరు పొద్దున, సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన వుంటుంది...

Updated : 07 Feb 2019 21:57 IST

భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కొందరు పొద్దున వెలిగిస్తే మరి కొందరు పొద్దున, సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన వుంటుంది. దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు దారిని చూపించి ధైర్యాన్ని ఇస్తుంది. దీపమనేది ఒక జ్ఞానంలాంటిది. అజ్ఞానాన్ని, చీకట్లను పారదోలుతుంది. మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి. దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. దీపశిఖ స్ఫూర్తిగా మనం కూడా జ్ఞానపు వెలుగులను అందుకుంటూ ఉన్నతశిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం.

దీపాన్ని వెలిగించి ఈ శ్లోకాన్ని జపించాలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని