గుడిలో గంటలు ఎందుకు మోగిస్తారు?

గంట మోగిస్తే వచ్చే శబ్దం మంగళకరమైనదని చెబుతారు. భగవంతుని దర్శనానికి ముందు మనసు లోపల, బయట కూడా మెలకువ, శ్రద్ధ పెంచుకోవడానికి గంట మోగిస్తాం. ‘ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసామ్‌ కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనామ్‌’...

Updated : 07 Feb 2019 21:27 IST

గంట మోగిస్తే వచ్చే శబ్దం మంగళకరమైనదని చెబుతారు. భగవంతుని దర్శనానికి ముందు మనసు లోపల, బయట కూడా మెలకువ, శ్రద్ధ పెంచుకోవడానికి గంట మోగిస్తాం.

‘ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసామ్‌ 
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనామ్‌’

అంటే సద్గుణ దైవీ పరమైన శక్తులు నాలో ప్రవేశించుగాక! నా గృహంలోనూ, హృదయంలోనూ అసురీ శక్తులు వైదొలుగుగాక! అనే ప్రార్థన ఘంటారావంలో చేస్తాం. హారతి ఇచ్చే సమయంలో కూడా గంట మోగిస్తాం. భక్తుల ఏకాగ్రత చెదరగొట్టే శబ్దాల నుంచి ఘంటానాదం, మంగళవాయిద్యాల శ‌బ్దం బయటపడేస్తాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని