Skydiving: 70 ఏళ్ల వయసులో స్కై డైవింగ్‌.. అబ్బురపరిచిన మంత్రి!

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌.. 70 ఏళ్ల వయసులో స్కైడైవింగ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

Published : 22 May 2023 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సాహసాలకు వయసు అడ్డుకాదని నిరూపించారు ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ (TS Singh Deo). ఏడు పదుల వయసులో ఆయన స్కైడైవింగ్‌ (Skydiving) చేసి అందరినీ అబ్బురపరిచారు. ఓ ఇన్‌స్ట్రక్టర్‌ సాయంతో ఆస్ట్రేలియాలో ఆయన ఈ ఫీట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

‘ఆకాశానికి హద్దులు లేవు. ఆస్ట్రేలియాలో స్కైడైవింగ్‌కు వెళ్లే అద్భుతమైన అవకాశం నాకు లభించింది. ఇదొక అసాధారణ సాహసం. ఎంతో ఉల్లాసకరమైన, ఆనందమైన అనుభవాన్ని మిగిల్చింది’ అని మంత్రి టీఎస్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఆయన సాహసాన్ని కొనియాడారు. ‘స్కైడైవింగ్‌ అద్భుతంగా చేశారు! మీ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించండి’ అని తెలిపారు. వయసు ఒక సంఖ్య మాత్రమేనని మీరు నిరూపించారంటూ ఓ నెటిజన్‌ స్పందించారు.

మంత్రి టీఎస్‌ సింగ్‌.. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2008 నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భూపేశ్‌ బఘేల్‌ క్యాబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని