Video: ఇళ్ల మధ్యలోకి మొసలి.. భయంతో వణికిన జనం!

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో శివపురి జిల్లాలో ఓ జనావాస కాలనీలో మొసలి సంచారం కలకలం రేపింది.....

Published : 14 Aug 2022 23:38 IST

శివపురి: మధ్యప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో శివపురి జిల్లాలో ఓ  కాలనీలో మొసలి సంచారం కలకలం రేపింది. దీంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మొసలిని పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం శివపురి జిల్లా కేంద్రంలోని ఓల్డ్‌ బస్టాండ్‌ సమీపంలోని ఓ కాలనీలో మొసలి సంచరిస్తున్నట్టుగా అక్కడి స్థానికులు గుర్తించారు. అధికారులకు సమాచారం ఇవ్వగా మాధవ్‌ నేషనల్‌ పార్కు నుంచి సహాయక బృందాన్ని రంగంలోకి దించారు. దాదాపు గంట పాటు శ్రమించి చివరకు ఎనిమిది అడుగుల పొడవైన మొసలిని పట్టుకొని సంఖ్యాసాగర్‌ సరస్సులో వదిలిపెట్టినట్టు సబ్‌డివిజినల్‌ పోలీస్‌ అధికారి అజయ్‌ భార్గవ తెలిపారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ఏదైనా నల్లా మార్గం ద్వారా ఈ మొసలి కాలనీలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని