Viral Video: తియ్యటి సింహం!
బంధించి ఉన్న సింహం దగ్గరకు వెళ్లాలంటేనే పిల్లలు భయపడతారు. కానీ ఈ సింహాన్ని చూపిస్తే తినకుండా వదిలిపెట్టరు.
ఇంటర్నెట్‌డెస్క్: బంధించి ఉన్న సింహం దగ్గరకు వెళ్లాలంటేనే పిల్లలు భయపడతారు. కానీ ఈ సింహాన్ని చూపిస్తే తినకుండా వదిలిపెట్టరు. ఎందుకంటే..! ఇదొక చాక్లెట్ సింహం. స్విట్జర్లాండ్‌కు చెందిన అమౌరీ గుయినోచ్ అనే పేస్ట్రీ చెఫ్ దీన్ని రూపొందించారు. వివిధ జంతువులు, రకరకాల వస్తువుల ఆకారాలను చాక్లెట్‌తో సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దడం గుయినోచ్ హాబీ. 5 అడుగుల 8 అంగుళాల పొడవు, 36 కిలోల బరువున్న ఈ చాక్లెట్ సింహాన్ని తయారు చేయడానికి అతనికి 5 రోజులు పట్టిందట. చాక్లెట్‌తో సింహం ఆకారాన్ని తయారుచేస్తున్న వీడియోను గుయినోచ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకోగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్‌లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్