ఉమసా.. బిగొటా!
క్యాంపస్ కొత్త భాష
తెలుగు అమ్మ భాషే.. అవొచ్చు! ఇంగ్లిష్..? ఎల్‌కేజీ నుంచే బట్టీ కొట్టేసి ఉండొచ్చు. మునివేళ్లతో సాధన చేసిన ఎస్‌ఎంఎస్ కోడ్ భాషా మీకొచ్చిండొచ్చు. అయినా... అవసరానికి ఇతర పేరు లేని భాషలూ పుట్టుకొస్తాయి. అలా వచ్చినదే కొత్తగా వైరల్ అవుతున్న ‘క్యాంపస్ భాష’ (క్యాంపస్ లింగో). దీని సంగతేంటి? మిలీనియల్స్ మస్తీ అంతా ఈ భాషలోనే సాగుతోంది. మరి, మీరు? ఫాలో అవడం మొదలెట్టారా?
మీకు ‘ఉమసా.. బిగొటా’ గురించి తెలుసా? అదేనండీ..
‘ఉమసా... ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం
బిగొటా.. బిల్ల, గొట్టం, టానిక్’ అన్నమాట. ఇదే తీరుగా ఈ క్యాంపస్ లాంగ్వేజీ పుట్టుకొస్తోంది. కాలేజీ క్యాంపస్‌ల్లో లేదంటే కేఫ్‌ల్లో ఫ్రెండ్స్ మధ్య సంభాషణల్ని ట్రాక్ చేయండి. వారి మాటల మధ్యలో వచ్చే కొన్ని పదాలకు అర్థాలే వేరు. ఇదే మాదిరిగా సోషల్ లైఫ్‌లోనూ. వారు పెట్టే కామెంట్‌లు, పోస్టింగ్‌ల్లో సరికొత్త పదాల్ని సృష్టిస్తున్నారు. ఇంగ్లీషే కదాని నిఘంటువు తెరిస్తే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఆ పదానికి అర్థం దొరకకపోవొచ్చు. ఇంగ్లిష్ ఫ్రొఫెసర్‌కి కూడా అంతుచిక్కని పదాలవి.
* కాలేజీ ఫుట్‌బాల్ మ్యాచ్ గురించి వైభవ్, ప్రణయ్‌లు మాట్లాడుకుంటున్నారిలా... Varun behaves so salty under pressure, I stan Aryan's team ఆ సంభాషణ వింటున్న శ్రీనుకి కొన్ని పదాలు అర్థం కాలేదు. ఏంటీ salty, stan .. అని బుర్ర పీక్కున్నాడు. ఇంతకీ ఆ రెండు పదాలకు అర్థం ఏంటంటే..
* salty- తప్పుగా ప్రవర్తించడం.
* stan- అభిమానిగా సపోర్టు చేయడం
మెట్రో నగరాల్లో విద్యార్థులు ఇప్పటికే ఈ కొత్త లాంగ్వేజీని ‘సీ’ లాంగ్వేజ్‌లా బాగానే ఒంటపట్టించుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న క్రాంతిని పలకరిస్తే... ‘ఇంగ్లిష్ వ్యాకరణంలో పాస్ట్‌టెన్స్ పదాల్లా అనిపిస్తాయ్. కానీ, కాదు. ఉదాహరణకు You should be woke about the #Metoo movement అంటే వాక్యంలోని woke ఏంటో అర్థం కాదు. ఇక్కడ woke అంటే ‘అవగాహన ఉండాలని’ చెప్పడం అన్నమాట. ఇదే మాదిరిగా lit. ఇదేదో ‘లైట్’ పదానికి పాస్ట్‌టెన్స్ అనుకోవద్దు. దీనికి అర్థం ఏంటంటే... ‘అద్భుతం, ఫన్నీ’ అని. ఇలా సందర్భాన్ని బట్టి క్యాంపస్ భాషని వాడడంలో మజానే వేరు. ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడినా పెద్దగా పట్టించుకోరుగానీ.. ఈ క్యాంపస్ లింగోని జోడిస్తే మాత్రం ఫ్రెండ్స్ ఇట్టే కనెక్టు అవుతారు’
సృష్టించడం మంచిదే
‘ఎవ్వరూ సృష్టించకుంటే కొత్త పదాలు ఎలా పుడతాయ్.’ ఎప్పుడో మాయబజార్ సినిమాలో ఘటోత్కచుడితో చెప్పించారీ మాట. మరి ఇప్పుడు అంగీకరించకుంటే ఎలా అంటున్నారు కొందరు భాషా నిపుణులు. భాష ఏదైనా సరికొత్త పదజాలం పుట్టుకొస్తున్నప్పుడే ఆ భాష నిలుస్తుంది అంటున్నారు వీరు. ఇంగ్లిష్ ప్రపంచ భాష కావడంతో ఇలాంటి పద జాలం తక్కువ సమయంలో ఆదరణ పొందుతుంది. పదాలు ఎలా పుడతాయ్ అనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అవసరానికి ఎవరో ఒకరు వాడితే అవి ట్రెండింగ్ మారిపోతుంటాయ్. తొందర్లో ఎవరో TTYL అని టైప్ చేస్తే.. Talk to You Later అని గుర్తుంచుకుంటున్నారు. ఇదే మాదిరిగా ROFL. అంటే.. Rolling On Floor Laughing అని.
సోషల్ లైఫ్‌లోనూ.. |
పరిమితం చేయాలి - టీఎస్ రావు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
|
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?