నీట్‌ - 50

ఇదేంటి సూపర్‌ 30 గురించి చదివాం గానీ... ఈ సూపర్‌ 50 ఏంటి అనుకుంటున్నారా? ఐఐటీ ఆనంద్‌కుమార్‌ సూపర్‌ 30 స్ఫూర్తితో ప్రారంభమైందే ఈ నీట్‌-50. అది ఐఐటీలకు పేద పిల్లలను పంపితే... ఇది వైద్యవిద్యలోకి నిరుపేద పిల్లలను ఎంపికయ్యేలా చేస్తోంది.

Published : 29 Jun 2019 00:52 IST

దేంటి సూపర్‌ 30 గురించి చదివాం గానీ... ఈ సూపర్‌ 50 ఏంటి అనుకుంటున్నారా? ఐఐటీ ఆనంద్‌కుమార్‌ సూపర్‌ 30 స్ఫూర్తితో ప్రారంభమైందే ఈ నీట్‌-50. అది ఐఐటీలకు పేద పిల్లలను పంపితే... ఇది వైద్యవిద్యలోకి నిరుపేద పిల్లలను ఎంపికయ్యేలా చేస్తోంది.
సరన్‌ అనే యువ వైద్యుడి ప్రయత్నమే ఈ నీట్‌-50. రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మర్‌ నగరంలో సరన్‌ ‘50 విలేజర్స్‌ సేవా సంస్థాన్‌’ను ప్రారంభించారు. వైద్యవిద్య అంటే ఎంత ఖరీదైనదో అందరికీ తెలిసింది. మరి దీన్ని పేదరికంలో మగ్గే పిల్లలకు అందించడం ఎలా? ఆలోచించి.. ఈ ప్రయత్నం మొదలు పెట్టారు డాక్టర్‌ సరన్‌. గ్రామాల్లో తిరిగి 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పేద పిల్లలను ఎంపిక చేశారు. దుస్తుల దగ్గర నుంచి పుస్తకాలు సహా ఉచిత భోజన వసతి కల్పించారు. ఇంటర్‌ బోధించారు. ప్రథమ సంవత్సరంలో 25, ద్వితీయ సంవత్సరంలో 25మందిని ఒక తరగతిగా తీసుకొని క్లాస్‌లు చెప్పారు. నేషనల్‌ ఎలిజిబులిటీ, ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)కు సిద్ధం చేశారు. ఇలా 2015లో 28 మందిని నీట్‌లో ఎంపికయ్యేలా చేశారు సరన్‌. అలా వెలుగులోకి వచ్చిన నీట్‌-50 ఏటా వెనుకబడిన పేద విద్యార్థులను ఉన్నత విద్య వైపు నడిపిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని