ప్రభుత్వ సేవలన్నీ..!

ప్రభుత్వ రంగ సంస్థల సర్వీసులు ఒకే ప్లాట్‌ఫామ్‌ మీద వాడుకోవాలంటే..! అందుకే ఈ యాప్‌....

Updated : 04 Apr 2020 00:32 IST

వాడేద్దురూ!

ప్రభుత్వ రంగ సంస్థల సర్వీసులు ఒకే ప్లాట్‌ఫామ్‌ మీద వాడుకోవాలంటే..! అందుకే ఈ యాప్‌. ఇదో ఈ- గవర్నెస్స్‌ సర్వీసు. పేరు UMANG. సింపుల్‌గా మీ మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌తో లాగిన్‌ అయితే చాలు. అన్ని ప్రభుత్వ సర్వీసులు ఒకే దగ్గర వాడుకోవచ్ఛు ఆధార్‌, డిజీలాకర్‌, నేషనల్‌ పెన్షన్‌ సిస్టం వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల సేవల్ని వినియోగించుకోవచ్ఛు అంతేకాదు ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజనా, ఆయుష్మాన్‌ భారత్‌, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాల ప్రయోజనాలను పొందొచ్ఛు మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగదారుల సౌకర్యార్థం ఈ యాప్‌ను సెక్యూర్‌గా తీర్చిదిద్దారు. ఆరోగ్య, ఆర్థిక, విద్య, వ్యవసాయ, రవాణా వంటి సుమారు 600రకాల ప్రభుత్వరంగ సేవల్ని వినియోగించుకోవచ్ఛు 10రకాల భాషల్లో ఈ యాప్‌ని అందుబాటులో ఉంచారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని