టాప్‌లో ప్రింటెడ్‌ బాటమ్స్‌

నిన్నటిదాకా టాప్‌ లెవెల్లో కుర్రకారును చుట్టేసిన ప్రింట్‌ ఫ్యాషన్ల ట్రెండ్‌ ఇప్పుడు కాస్త కిందకి దిగింది. ప్రింటెడ్‌ బాటమ్స్‌ తెరమీదికొచ్చాయి. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అంతా దీనికి ఫిదా అయిపోతున్నారు. కరోనా,

Published : 22 May 2021 00:26 IST

నిన్నటిదాకా టాప్‌ లెవెల్లో కుర్రకారును చుట్టేసిన ప్రింట్‌ ఫ్యాషన్ల ట్రెండ్‌ ఇప్పుడు కాస్త కిందకి దిగింది. ప్రింటెడ్‌ బాటమ్స్‌ తెరమీదికొచ్చాయి. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అంతా దీనికి ఫిదా అయిపోతున్నారు. కరోనా, లాక్‌డౌన్‌తో జనం అంతా ఇళ్లకే పరిమితం అయిన ఈ సమయంలో ఈ రంగురంగుల ప్రింట్ల ఫ్యాషన్లు ధరిస్తే డల్‌గా ఉన్న మూడ్‌ మారిపోయే అవకాశం ఉందన్నది ఫ్యాషనిస్ట్‌ల మాట. అందుకే జీన్స్‌, షార్ట్స్‌, ట్రోజర్స్‌, రెగ్యులర్‌ ప్యాంట్లు.. ఏ రకం బాటమ్‌వేర్‌ అయినా ఈ ప్రింట్లకు ఓటేస్తున్నారు. ఇందులో ప్యాటర్న్‌ మిక్సింగ్‌లు, కివీ ప్రింట్లు, ట్రోపికల్‌ ప్రింట్లు, జియో మెట్రిక్‌, ప్రింటెడ్‌ జాగర్లు, ఫ్లోరల్‌ ప్రింట్లు, టై అండ్‌ డై ప్యాటర్న్‌లు.. టాప్‌లో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని