ఎంత డేట్‌ ప్రేమయో..!

డేటింగ్‌ అంటే? మనసు విప్పి ఒకర్నొకరు అర్థం చేసుకోవడం.. రొమాన్స్‌లో తేలిపోవడం... ఎవరికి నచ్చిన అర్థం వాళ్లకి ఉంటుంది. ఇవేకాదు ఈ మధ్య ‘లాంగ్‌ డిస్టెన్స్‌’, ‘జూమ్‌ డేటింగ్‌’ అని కొత్తగా వినపడుతున్నాయి.ఈ జాబితా ఇంతటితో ఆగదు అంటోంది ప్రముఖ డేటింగ్‌ యాప్‌ బంబుల్‌.

Published : 10 Jul 2021 03:00 IST

డేటింగ్‌ అంటే? మనసు విప్పి ఒకర్నొకరు అర్థం చేసుకోవడం.. రొమాన్స్‌లో తేలిపోవడం... ఎవరికి నచ్చిన అర్థం వాళ్లకి ఉంటుంది. ఇవేకాదు ఈ మధ్య ‘లాంగ్‌ డిస్టెన్స్‌’, ‘జూమ్‌ డేటింగ్‌’ అని కొత్తగా వినపడుతున్నాయి.ఈ జాబితా ఇంతటితో ఆగదు అంటోంది ప్రముఖ డేటింగ్‌ యాప్‌ బంబుల్‌. డేటింగ్‌ చేసేవాళ్ల మనస్తత్నాన్ని బట్టి కొత్త ట్రెండ్స్‌ రాబోతున్నాయట. అవేంటంటే..

హార్డ్‌బాలింగ్‌: వీళ్లు డేటింగ్‌కి ఓకే. కానీ అనవసరంగా సమయం వృథా చేయడానికి ఇష్టపడరు. ప్రేమ, రొమాన్స్‌.. అవతలివాళ్ల నుంచి కోరుకున్నది దక్కదని తేలిపోతే వెంటనే బంధానికి ‘బై’ చెప్పేస్తారు. జంకు, మొహమాటాలేం ఉండవు. ఈ ట్రెండ్‌నే ‘డేటింగ్‌ లైక్‌ సీఈవో’ అని కూడా అంటారు.

ఆస్ట్రో లవ్‌: మేషం, తుల రాశుల వాళ్లు డేటింగ్‌ చేయనే కూడదనేది నియమం. జాతకాలపై నమ్మకం ఉన్నవాళ్ల సంగతి లెండి ఇది! ఇది ఇంకా ముందుకెళ్లి ఫలానా రాశి వాళ్లు ఆ రాశి వారినే లవ్వాడాలి, డేటింగ్‌ చేయాలి అనే ధోరణి పెరిగిపోతుందట. ఎందుకంటే డేటింగ్‌ యాప్‌లలో ‘ఆస్ట్రాలజీ బ్యాడ్జ్‌’ అనే కొత్త ఫీచర్‌ జోడించడం వల్ల కలిగే ప్రభావం ఇది.

స్లో డేటింగ్‌: డేట్‌ అంటేనే అమ్మాయి, అబ్బాయి మధ్య ఏ సంగతైనా ఫటాఫట్‌ తేలిపోయే విషయం. దీనికి వ్యతిరేకం స్లో డేటింగ్‌. ఇద్దరి మధ్య వ్యవహారం మెల్లిగా వేడెక్కుతుంది. ఎప్పుడోగానీ కలుసుకోరు. అన్నీ నచ్చాక గానీ జట్టు కట్టరు. ఉన్నవాటిలో ఇదే ఉత్తమం అంటారు సైకాజిస్టులు.
వర్చువల్‌ డేటింగ్‌: ప్రస్తుతం కుర్రకారు అత్యధికంగా మొగ్గుచూపుతున్న ట్రెండ్‌. వీడియో, ఫోన్‌ కాల్స్‌ ద్వారా అభిప్రాయాలు పంచుకుంటారు. ఆన్‌లైన్‌లో కలిసి గేమ్స్‌ ఆడుతుంటారు. సినిమాలు చూస్తారు. అన్నీ ఓకే అయ్యాకే భౌతికంగా కలుసుకోవడం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని