Published : 21 Aug 2021 03:28 IST

నాకొక గాళ్‌ఫ్రెండ్‌ కావాలీ...!

దోస్త్‌ల ఆస్తులున్నోళ్లకి జిందగీ ఖుషీగా ఉంటుందన్నది వాస్తవం. అందులోనూ అమ్మాయిలతో అయితే స్నేహం ఫెవికాల్‌ బంధమేనట. తను స్నేహితురాలే కావొచ్చు. మనసు దోచిన ప్రేయసి అయ్యుండొచ్చు. కడదాకా తోడుండే శ్రీమతి అయిపోవచ్చు. అసలు గాళ్‌ఫ్రెండ్‌తో ఏం లాభాలంటే..?

బాధల్లో వెలుగురేఖలా: మనిషన్నాక కష్టాలు కామన్‌. అలాంటి సందర్భాల్లో మనసు భారంగా ఫీల్‌ అవుతుంటే తల ఆన్చి నాలుగు కన్నీటి బొట్లు రాల్చడానికి ఒక భుజం కావాలి. తను గాళ్‌ఫ్రెండ్‌ అయితే బాధలు మబ్బుల్లా తేలిపోయినట్టే.

దీర్ఘాయుష్షు: బ్రిగ్హమ్‌ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ఎక్కుమంది స్నేహితులు ఉండి, తరచూ వాళ్లతో టచ్‌లో ఉంటే దీర్ఘకాలిక రోగాలు దరిచేరవట. మిగతా వాళ్లతో పోలిస్తే వాళ్ల ఆయుర్ధాయం 13 ఏళ్లు ఎక్కువని తేలింది.

సంతోషాలకు వెన్నుదన్నుగా: తీరిక లేకుండా జోరుగా సాగిపోతున్న జిందగీకి అప్పుడప్పుడు బ్రేక్‌ కావాలంటారు కుర్రాళ్లు. వారాంతాల్లో చిన్న ట్రీట్‌, పని మధ్యలో కాఫీ బ్రేక్‌.. ఏదైనా. ఈ సమయంలో నచ్చిన చిన్నది పక్కనే ఉంటే ఆనందం డబుల్‌ అవుతుంది.

మనపైనే నమ్మకం: అన్ని దారులూ మూసుకు పోయినప్పుడు.. మనపై మనకు నమ్మకం ఉండదు. ఏమీ చేయలేననే నిస్పృహలో పడిపోతాం. అప్పుడు నువ్వు ఇది చేయగలవ్‌ అని భుజం తట్టి నడిపిస్తుంది ప్రేయసి/ అర్ధాంగి. చేతిలో చేయేసి మనకు గొప్ప భరోసానిస్తుంది. ఆమె అండతో గడ్డు కాలంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటాం.

షేర్‌క్వీన్‌లు: కష్టసుఖాలు పంచుకునే షేర్‌క్వీన్‌లు మన పక్కనే ఉంటే.. చేసే పనిలో సాయం చేస్తారు. చిరుతిళ్లు చేసి పెడతారు. కాలేజీ హోంవర్క్‌ నుంచి హోంలో వర్క్‌ దాకా అన్నింట్లో ఆసరాగా ఉంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు