Published : 28 Aug 2021 01:12 IST

వెచ్చవెచ్చని షాకెట్స్‌

ఫ్యాషన్‌ ప్రియులకు అన్ని కాలాలూ అనుకూల సమయమే. రాబోయేది చలికాలం. దీనికి చెక్‌ పెడుతూ ఓ వెచ్చవెచ్చని ట్రెండ్‌ కుర్రకారు ఒంటిని చుట్టేస్తోంది. అదే షాకెట్స్‌. షర్ట్‌, జాకెట్‌కి మధ్యస్థంగా ఉండే ఔట్‌ఫిట్‌నే ఈ షాకెట్‌. అంటే చొక్కాలా మరీ పలుచనైంది కాదు.. అలాగే జాకెట్‌లా మరీ మందంగా ఉండదు అన్నమాట. దీనికే కాస్త సొగసుల్ని మేళవించి అందంగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. ఫుల్‌ స్లీవ్స్‌ వీ ఆకారం, భుజాలు కిందికి దిగిన డిజైన్‌.. ఇలా ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. తొంభైల్లో పాపులర్‌ అయిన ఈ ట్రెండ్‌ కొద్దిపాటి మార్పులతో మళ్లీ వచ్చేసింది. అమందా హోల్డెన్‌, కటీ హోమ్స్‌, రిహాన్నా లాంటి అంతర్జాతీయ సెలెబ్రెటీలు మొదలు పెట్టిన ఈ ట్రెండ్‌ హద్దులు దాటి మన మెట్రో నగరాల్లోకీ వచ్చేసింది. ఈ టాప్‌ని జీన్స్‌, జెగ్గింగ్స్‌, లెగ్గింగ్స్‌.. వేటితో అయినా జతగా వేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు