ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!

అరే.. కొంచెం పొట్ట తగ్గితే చాలు... హీరోవే! ఈ పొట్ట లేకుండా ఉంటే... టీషర్ట్‌ సెట్టయ్యేది! పొట్ట కన్పించకుండా చెయ్‌ ... చిటికెలో సంబంధం సెట్‌ అవుద్ది! ... ఇలా చాలా మంది యువతది ‘పొట్ట’ సమస్య.

Updated : 31 Dec 2018 17:31 IST
ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!
అరే.. కొంచెం పొట్ట తగ్గితే చాలు... హీరోవే! ఈ పొట్ట లేకుండా ఉంటే... టీషర్ట్‌ సెట్టయ్యేది! పొట్ట కన్పించకుండా చెయ్‌ ... చిటికెలో సంబంధం సెట్‌ అవుద్ది! ... ఇలా చాలా మంది యువతది ‘పొట్ట’ సమస్య. 2018లో ఇలా మీరు పడిన సంఘర్షణ చాలు. 2019లో దీన్ని తగ్గించుకోవడానికి ఏమైనా చేయాలని మీ లక్ష్యం అయితే... ఇంట్లోనే ఓ అరగంట మీది కాదనుకొని... ఈ వ్యాయామాలు చేస్తే పొట్ట కరిగిపోతుందంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!

బర్పీస్‌-స్వ్కాట్‌ థస్ట్‌ :   ఈ మూడు పొజిషన్స్‌ని...  10 సార్లు చొప్పున మూడు సెట్లు చేస్తే మంచిది.

ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!

క్రంచెస్‌ : ఈ చిత్రాల్లో చూపినట్లు 15సార్ల చొప్పున మూడు సెట్లు చేయాలి.

ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!

జూడో పుషప్స్‌: 12సార్ల చొప్పున మూడు సెట్లు చేయాలి. దీని వల్ల పొట్టతో పాటు... ఛాతీ కండరాలు బలపడతాయి.

ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!

మౌంటెన్‌ క్లైంబర్స్‌ : 15సార్ల చొప్పున 3 సెట్లు చేయాలి. పొట్టతో పాటు... నడుం, కాలి కండరాలకు వ్యాయామం అవుతుంది.

ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!

జంప్‌ స్క్వాట్‌ : 15సార్ల చొప్పున 2 సెట్లు చాలు. ఇది చేయడం వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది.

ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి!

లేయింగ్‌ లెగ్‌ రైస్‌: 15సార్ల చొప్పున ఈ సెట్లు చేయాలి.

* ఏ వ్యాయామానికి ముందైనా వార్మప్‌ చేయక తప్పదు. ఒక 10 నిమిషాలు శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేశాక వీటిని మొదలు పెడితే మంచి ఫలితం వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచి ప్రయత్నించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని