మరింత ఛరిష్మాతో కరిజ్మా

‘నువ్వే కావాలి’ రోజుల నుంచే హీరో కరిజ్మా బండికి యువతలో యమా క్రేజ్‌ ఉంది. అంత పాపులారిటీ ఉన్నా.. అనివార్య కారణాలతో రెండేళ్ల కిందట మోడల్‌ని ఉపసంహరించుకున్నారు.

Updated : 01 Apr 2023 06:01 IST


‘నువ్వే కావాలి’ రోజుల నుంచే హీరో కరిజ్మా బండికి యువతలో యమా క్రేజ్‌ ఉంది. అంత పాపులారిటీ ఉన్నా.. అనివార్య కారణాలతో రెండేళ్ల కిందట మోడల్‌ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ‘కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌’ పేరుతో మళ్లీ తీసుకొస్తున్నారు. ఇంతకీ కొత్తగా జోడించిన ఫీచర్లేంటి? అంటే..

సాంకేతికాంశాలు: 210సీసీ, సింగిల్‌ సిలిండర్‌, 25బీహెచ్‌పీ ఇంజిన్‌, 30ఎన్‌ఎం సామర్థ్యంతో దూసుకెళ్తుంది.

ఫీచర్లు: అలాయ్‌ చక్రాలు, రేర్‌ వ్యూ మిర్రర్‌, టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు.. కొన్ని చెప్పుకోదగ్గ ఫీచర్లు.

పోటీదారులు: బజాజ్‌ పల్సర్‌ 250, సుజుకీ జిక్సర్‌ 250

మైలేజీ: 49కి.మీ./లీ

ధర: రూ.1.70లక్షలు (ఎక్స్‌ షోరూం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని