నువ్వూనేనూ.. సేమ్‌ సేమ్‌

సెలెబ్రిటీలు ఏదైనా చెప్పాలనుకుంటే.. లోకమంతా చాటింపు వేసి మరీ చెబుతారు. మనసు పడ్డవారితో.. మనువాడిన వారితో ఉన్న ప్రేమను మాత్రం దాచుకుంటారా? ఈమధ్యకాలంలో ఆ లవ్‌, ఇష్క్‌, కాదల్‌ని ‘ట్విన్నింగ్‌ ఫ్యాషన్‌’ రూపంలో తెలియజెబుతున్నారు.

Published : 24 Jun 2023 00:22 IST

సెలెబ్రిటీలు ఏదైనా చెప్పాలనుకుంటే.. లోకమంతా చాటింపు వేసి మరీ చెబుతారు. మనసు పడ్డవారితో.. మనువాడిన వారితో ఉన్న ప్రేమను మాత్రం దాచుకుంటారా? ఈమధ్యకాలంలో ఆ లవ్‌, ఇష్క్‌, కాదల్‌ని ‘ట్విన్నింగ్‌ ఫ్యాషన్‌’ రూపంలో తెలియజెబుతున్నారు. అంటే.. ప్రేమలో పడ్డ నాయికానాయికలు, పెళ్లితో ఒక్కటైన హీరోహీరోయిన్లు తమ భాగస్వాములతో ఒకేరకమైన రంగు, డిజైన్‌, షూలు, ఆభరణాలు, టోపీలు, కళ్లద్దాలు.. ధరించడం ఈ ట్రెండ్‌ అన్నమాట. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడాలేం లేవు.. దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో దీన్నే ఫాలో అవుతున్నారు. ఒకరికొకరు తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజెప్పడానికి ఇదొక మార్గం అని భావిస్తున్నారు. పార్టీలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఆధునిక వస్త్రధారణతో మెరిసిపోతూ.. పండగలు, ఉత్సవాలప్పుడు సంప్రదాయ సొగసులు చిందిస్తున్నారు. ఈ విషయంలో పవర్‌ కపుల్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మలు ముందున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌-దీపిక పదుకొణె, రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌లు సైతం తరచూ ట్విన్నింగ్‌ ఫ్యాషన్‌కి చిరునామాగా మారారు. మీరా రాజ్‌పుత్‌-షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ- సిద్ధార్థ్‌ మల్హోత్రా కూడా ఈ జాబితాలో చేరారు. మిగతావాళ్లూ ఊరుకుంటారా? అడపాదడపా వారూ ఇలా మెరిసిపోతూ ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని