దృఢమైన పొట్ట కండరాలకు..

‘నేను ఫిట్‌గా ఉన్నా బాస్‌..’ అని ఎవరితో అయినా చెప్పుకోవాలంటే ముందు కరిగించాల్సింది పొట్టని. అది జరిగితేనే సిక్స్‌ప్యాక్‌లు సాధించొచ్చు, పొట్ట కండరాలను దృఢంగా చేసుకోవచ్చు. దానికోసమే ఈ కసరత్తులు.

Published : 02 Apr 2022 02:16 IST

పడవ ఆకారపు వ్యాయామం

(బోట్‌ పోజ్‌)

‘నేను ఫిట్‌గా ఉన్నా బాస్‌..’ అని ఎవరితో అయినా చెప్పుకోవాలంటే ముందు కరిగించాల్సింది పొట్టని. అది జరిగితేనే సిక్స్‌ప్యాక్‌లు సాధించొచ్చు, పొట్ట కండరాలను దృఢంగా చేసుకోవచ్చు. దానికోసమే ఈ కసరత్తులు.

చూడ్డానికి తేలికగా కనిపించినా ఈ వ్యాయామం కొంచెం కఠినమైందే. కాళ్లు ముందుకు చాచి నడుము నిటారుగా ఉండేలా కూర్చోవాలి. శరీరాన్ని కొంచెం వెనక్కి వంచుతూ, చేతులు ముందుకు చాచాలి. అదే సమయంలో కాళ్లను పైకి లేపుతూ చేతులతో అందుకోవాలి. కొన్ని సెకన్లపాటు అలాగే ఉంచి యథాస్థానంలోకి రావాలి.

* రివర్స్‌ క్రంచెస్‌

మ్యాట్‌పై వెల్లకిలా పడుకోవాలి. కాళ్లను పైకి లేపి మోకాళ్లు మడవాలి. చేతులను నేలపై ఆనించి మడిచిన మోకాళ్లను ఛాతీవైపు నెడుతూ ఉండాలి.

* బైసికిల్‌ క్రంచెస్‌

మ్యాట్‌పై వెల్లకిలా పడుకొని కాళ్లను గాల్లోకి లేపాలి. అరచేతులను తల వెనకాల పెట్టి మెల్లిగా శరీరాన్ని పైకి లేపాలి. శరీరం మొత్తం భారం పిరుదులపై పడేలా చేయాలి. గాల్లోనే ఉన్న ఎడమ కాలిని కుడివైపునకు, కుడికాలిని ఎడమ వైపునకు తిప్పుతూ ఉండాలి. దీంతో పొట్ట కండరాలు, పక్కటెముకలకు మంచి వ్యాయామం.

* వీటితోపాటు పర్వతాలు ఎక్కుతున్నట్టుగా ఉండే ‘మౌంటెయిన్‌ క్లైంబర్‌’, వెల్లకిలా పడుకొని కత్తెరలా కాళ్లను కిందికీ, పైకి ఆడించే పైలేట్స్‌ సిజర్‌ కసరత్తులు సైతం నడుము కింది భాగాన్ని దృఢం చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని