పద్ధతి పాటిస్తేనే ఫిట్నెస్ హిట్!
కసరత్తులు చేయడం.. కండలు పెంచడం.. ఫిట్నెస్ సాధించడం.. అందరికీ ఇష్టమే. కానీ దీనిపై చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. అవేంటి? అసలు కథేంటి? అంటే..
ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ప్రయోజనం.. వ్యాయామంలో హార్డ్‌వర్క్ కన్నా స్మార్ట్‌వర్క్ బాగా పని చేస్తుంది. ఎంత ఎక్కువసేపు కసరత్తులు చేశాం అన్నది కాదు.. ఎంత ప్రభావవంతంగా, పద్ధతిగా చేశామన్నదే ముఖ్యం. క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి.
కసరత్తులు చేయడానికి ఉదయమే ఉత్తమం.. ఎనిమిది గంటల నిద్ర తర్వాత ఉదయం వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న చాలామంది భావన. చుట్టుపక్కల వాతావరణం బాగుంటే, ఏకాగ్రతను దెబ్బ తీయని పరిస్థితులైతే సమయం ఏదైనా ఫర్వాలేదు. క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయం ఎంచుకుంటే మేలు.
డైట్ సరిగా పాటించకపోయినా మంచి వ్యాయామం చేస్తే ఫిట్నెస్ సొంతమవుతుంది.. స్వీట్లు, నూనె పదార్థాలు, మసాలాలు, జంక్ ఫుడ్ బాగా తీసుకొని జిమ్‌లో చెమట్లు చిందిస్తే సరిపోదు. వ్యాయామంతోపాటు సరైన ఆహారం తీసుకుంటేనే మంచి ఫలితాలొస్తాయి.
కసరత్తులు చేసి ఒంట్లో ఎక్కడంటే అక్కడ కొవ్వు కరిగించుకోవచ్చు. కోరుకున్న చోటే ఒళ్లు పెంచొచ్చు, తగ్గించొచ్చు.. కాస్త కష్టపడితే కండలు పెంచేయొచ్చు, సిక్స్‌ప్యాక్‌గా మలిచేయొచ్చు అనుకుంటారు చాలామంది. కానీ, అంత దృశ్యం లేదు. ఒంట్లోని కండరాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. క్రంచెస్ చేస్తుంటే బెల్లీ తగ్గడమే కాదు.. తొడలపై ప్రభావం పడుతుంది. షోల్డర్ ప్రెస్ వ్యాయామాలు చేతులు, భుజాల్ని దృఢం చేయడమే కాదు.. వీపు కండరాలపై ప్రతికూలంగా పని చేస్తాయి.
వ్యాయామానికి ముందు స్ట్రెచింగ్ చేస్తే.. గాయాలు తగ్గిపోతాయి.. ఎలాంటి ఇబ్బందులుండవు.. కసరత్తులకు శరీరం సిద్ధమవడం కోసం చిన్నచిన్న సాగతీత వ్యాయామాలు చేయాలని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఇది మంచి అలవాటే. కానీ ఇదొక్కటే గాయాలు, కండరాలు పట్టేయడాన్ని తగ్గించలేదు. సరైన పద్ధతుల్లో కసరత్తులు చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే గాయాల పాలు కాకుండా చేస్తుంది.
- దినేష్, ఫిట్నెస్ ట్రైనర్
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
-
Business News
బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం