Published : 20 Aug 2022 01:07 IST

కురచవాళ్లకీ..కుదిరే స్టైల్‌..


స్టైల్‌గా ఉండటం ఆజానుబాహులకే సొంతమా?
అదేం కాదు.. కురచగా ఉన్నవాళ్లూ.. కొన్ని కిటుకులు
పాటిస్తే నవ మన్మథుల్లా మెరిసిపోవచ్చు. ఇదిగో ఇలా..

*స్ట్రైప్స్‌ డిజైన్లు ఉన్న చొక్కాలు ధరించాలి. ఇందులో అడ్డ గీతలవి మనిషిని కొంచెం లావుగా కనపడేలా చేస్తే.. నిలువు గీతలవి పొడవుగా చూపిస్తాయి. షర్టులు, టీషర్టులు.. వార్డ్‌రోబ్‌లో ఇవి ఉండేలా చూసుకోవాలి. ఇందులో టెక్చర్డ్‌ ఫాబ్రిక్స్‌ ఎంచుకుంటే మంచిది.
*ముదురు రంగుల్లో ఉన్న ప్యాటర్న్‌లు, ప్రింట్లు పెద్ద ఆకారంలో ఉన్నవి కురచ కుర్రాళ్లకి నప్పవు. ఇవి శరీర ఆకారాన్ని మరింత చిన్నగా కనబడేలా చేస్తాయి. వీటికి బదులు చెక్స్‌కి ఓకే చెప్పొచ్చు. ఇందులోనూ లేత రంగు చొక్కాలు ఎంచుకోవాలి. అపోజిట్‌ ముదురు రంగులూ నివారించాలి.
* బ్యాగీ స్టైల్‌ డిజైన్లు, వదులు దుస్తులు పొట్టివాళ్లకి ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇలాంటివి ధరిస్తే అందరి దృష్టి మనపై పడేలా చేస్తాయి. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లు ఎప్పుడైనా ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉన్న డ్రెస్‌లే ధరించాలి.  
* ఎత్తు తక్కువగా ఉన్నామని హీల్స్‌, మడమలు ఎక్కువగా ఉన్న షూలు ధరిస్తే.. దొరికిపోతాం. వీటికి బదులు మామూలు షూలే ధరించాలి. మన ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.
* ప్యాంట్‌, షర్ట్‌, టీషర్టులు.. ఔట్‌ఫిట్‌ ఏదైనా.. కురచ అబ్బాయిలకు రెడీమేడ్‌ దుస్తులు దొరకడం కొంచెం కష్టమే. అందుకే రెడీమేడ్‌కి బదులు కొలతలకు అనుగుణంగా దర్జీతో కుట్టించుకోవాలి.  
* పొడవాటి టై, మందం ఉండే బెల్ట్‌, పెద్ద సైజు స్మార్ట్‌వాచీలు పొట్టిగా ఉండేవాళ్లను మరింత కురచగా కనపడేలా చేస్తాయి. కొంచెం కష్టమైనా ఫర్వాలేదు.. శరీరానికి సరిగ్గా సరిపోయే యాక్సెసరీలనే ఎంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts